News August 12, 2024
పులివెందులలో దొంగల భయం

పులివెందుల పట్టణంలోని పార్నపల్లి బస్టాండ్‌లో వరుస దొంగతనాలతో ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో దాదాపు 10కి పైగా దొంగతనాలు జరిగాయని సమాచారం. లింగాలకు చెందిన ఓ వ్యక్తి నుంచి వరుసగా 3 సెల్ ఫోన్లు, రూ.లక్ష నగదు వేర్వేరు సమయాల్లో దొంగలు దోచుకెళ్లారు. ఈ విషయమై అర్బన్ సీఐ మోహన్ కుమార్ మాట్లాడుతూ.. పార్నపల్లి బస్టాండ్‌లో దొంగతనాలు జరగకుండా పోలీసులతో గస్తీ నిర్వహిస్తామని చెప్పారు.
Similar News
News November 3, 2025
పెన్షన్ కోసం మూడేళ్లుగా ఎదురుచూపులు

భర్త మరణించి మూడేళ్లు గడిచినా పెన్షన్ కోసం ఇంకా ఎదురుచూస్తున్నట్లు గోపవరం(M) సండ్రపల్లికి చెందిన చెన్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. పెన్షన్ కోసం దరఖాస్తు చేసినా సచివాలయ అధికారుల నుంచి సరైన స్పందన లేదని వాపోయారు. అధికారులు కరుణించి, వితంతు పెన్షన్ మంజూరు చేయాలని వేడుకుంటున్నట్లు ఆమె కనీటి పర్యంతమయ్యారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.
News November 2, 2025
వరల్డ్ కప్.. వికెట్ పడగొట్టిన శ్రీచరణి

మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఇందులో భాగంగా కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన టీం ఇండియా బౌలర్ శ్రీచరణి వికెట్ పడగొట్టింది. సౌతాఫ్రికా 62 పరుగుల వద్ద ఉండగా ఆమె బ్యాటర్ బాష్(Bosch)ను రెండో వికెట్‌గా పెవిలియన్‌కు పంపింది.
News November 2, 2025
మాజీ ఉప రాష్ట్రపతిని కలిసిన మాజీ సైనికులు

కడప R&B గెస్ట్ హౌస్‌లో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడును ఆదివారం జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ మాజీ సైనికులు మర్యాదపూర్వకంగా కలిశారు. అందరూ కలిసి కట్టుగా ఐకమత్యంగా సంతోషంగా ఉండాలని వెంకయ్య చెప్పారన్నారు. తమ పట్ల మాజీ ఉప రాష్ట్రపతి చూపిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపామని వారు అన్నారు.


