News August 12, 2024

కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు ఈ నెల 14,15న విజయవాడ మీదుగా నాందేడ్(NED), శ్రీకాకుళం(CHE) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07487 ఆగస్టు 14న NED-CHE, 15న CHE- NED మధ్య ఈ రైళ్లు నడుపుతామన్నారు. ఏపీలో ఈ రైళ్లు విజయవాడతో పాటు విజయనగరం, దువ్వాడ, అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

Similar News

News November 26, 2024

సోషల్ మీడియాలో మంచిని మాత్రమే అనుసరించాలి: కొలుసు

image

యువతీ, యువకులు సోషల్ మీడియాలో మంచిని మాత్రమే అనుసరించాలని మంత్రి కొలుసు పార్ధసారధి విద్యార్థులకు సూచించారు. తాను వ్యక్తిగతంగా సోషల్ మీడియా ఫాలోకానని చాలా మంది ప్రముఖులు కూడా సోషల్ మీడియాను ఫాలో అవ్వరని చెప్పారు. సోమవారం ఎస్ఆర్ఆర్ కళాశాలలో సామాజిక మాధ్యమాల దుష్ప్రచారం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించి వివిధ అంశాలపై అవగాహన పెంపొందించుకోవచ్చని అన్నారు.

News November 26, 2024

కృష్ణా: MSC రెండో సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో సెప్టెంబర్- 2024లో నిర్వహించిన ఎంఎస్సీ- ఫారెస్ట్రీ, న్యూట్రిషన్ & డైటిక్స్, ఇన్‌స్ట్రమెంటేషన్ టెక్నాలజీ కోర్సుల 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలంది.

News November 26, 2024

కృష్ణా: నేడు అన్ని విద్యా సంస్థల్లో రాజ్యాంగ దినోత్సవం

image

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో భారత రాజ్యాంగ పీఠికను ఉదయం 11:30ని.లకు సామూహికంగా చదవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణా కలెక్టర్ బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలను గౌరవించడం, గుర్తించడం, రాజ్యాంగాన్ని ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు.