News August 12, 2024

సీఎం చంద్రబాబుతో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల భేటీ

image

AP: వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబుతో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు భేటీ అయ్యారు. నలుగురు సభ్యులతో కూడిన ఈ బృందం గత రెండు రోజులుగా అమరావతిలో పర్యటించింది. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, VIT, SRM యూనివర్సిటీలు, AIIMS, కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఈ టీం పరిశీలించింది. అమరావతిపై ఎలా ముందుకెళ్లాలనే అంశాలను వారికి వివరించిన బాబు.. రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని వారిని కోరారు.

Similar News

News January 23, 2026

ఉత్తమ్‌పై CM నిఘా అని వార్తలు.. మంత్రి క్లారిటీ

image

TG: CM రేవంత్ రెడ్డి మంత్రులు భట్టి, ఉత్తమ్‌పై నిఘా పెట్టి దావోస్ వెళ్లారని ఓ SM పేజ్‌లో వచ్చిన వార్తపై ఉత్తమ్ కుమార్ స్పందించారు. అందులో అసలు నిజం లేదని పేర్కొన్నారు. ఆ వార్త సారాంశం ఏంటంటే.. ‘మంత్రులు vs CM పంచాయితీ హైకమాండ్‌కు చేరింది. మంత్రులు భట్టి, ఉత్తమ్ కుమార్‌ను 12మంది MLAలు కలిశారు. CM ఇద్దరు మంత్రులపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టి వెళ్లారు’ అని వచ్చిన వార్తను మంత్రి ఖండించారు.

News January 23, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 23, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.30 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.06 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.22 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 23, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.