News August 12, 2024
ఆ సమయంలో కన్నీళ్లతోనే ఇంటికి వచ్చేదాన్ని: రష్మిక
కెరీర్ తొలినాళ్లలో మూవీ ఆడిషన్‌కు వెళ్లిన ప్రతిసారీ కన్నీళ్లతోనే ఇంటికి తిరిగి వచ్చేదాన్నని హీరోయిన్ రష్మిక అన్నారు. ఒక సినిమాకు సెలక్టయ్యాక 2, 3 నెలల పాటు వర్క్ షాప్స్ జరిగాయని, కొద్ది రోజులకే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రతి సినిమాకు తనను తాను మెరుగుపరుచుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం పుష్ప-2, సికిందర్, కుబేర వంటి చిత్రాలతో ఈ బ్యూటీ బిజీగా ఉన్నారు.
Similar News
News January 20, 2025
నేడు ట్రంప్ ప్రమాణ స్వీకారం
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమాన ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా వాషింగ్టన్ క్యాపిటల్ హాల్‌లోని రోటుండా ఇండోర్‌లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారత ప్రభుత్వం నుండి విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
News January 20, 2025
జనవరి 20: చరిత్రలో ఈరోజు
1900: సంస్కృతాంధ్ర పండితుడు పరవస్తు వెంకట రంగాచార్యులు మరణం
1907: ప్రముఖ రంగస్థల నటుడు బందా కనకలింగేశ్వరరావు జననం
1920: సినీ దర్శకుడు, ‘జానపద బ్రహ్మ’ బి.విఠలాచార్య జననం
1940: సినీనటుడు ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు జననం
1957: భారత్ తొలి అణు రియాక్టర్ ‘అప్సర'(ముంబై) ప్రారంభం
News January 20, 2025
విశ్వవిజేతలకు మోదీ అభినందనలు
ఖో ఖో విశ్వవిజేతలుగా నిలిచిన భారత పురుషుల, మహిళల జట్లకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ విజయాలతో గర్విస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఆటగాళ్ల పట్టుదల, నిబద్దత అభినందనీయమని కొనియాడారు. యువతకు ఖో ఖోలో ప్రాచుర్యం కల్పించేందుకు ఈ విజయం దోహదపడుతుందని పేర్కొన్నారు. దర్శకుడు రాజమౌళి విజేతలకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు.