News August 12, 2024
చిలుకూరు: ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం చెన్నారి గూడెం గ్రామానికి చెందిన మాతంగి గురవయ్య కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఈరోజు ఉదయం ఓ రైతు పొలంలో పురుగు మందు పిచికారీ చేసి ట్రాక్టర్‌పై వస్తుండగా ప్రమాదవశాత్తు బోల్తా పడగా గురవయ్య మృతి చెందారు. ఆయన మృతితో చెన్నారిగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News January 21, 2026
డిండి: విద్యార్థులను పరామర్శించిన డీఈవో

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న డిండి మోడల్ స్కూల్ విద్యార్థులను జిల్లా విద్యాశాఖాధికారి భిక్షపతి, యూటీఎఫ్ నాయకులు బుధవారం పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులతో నేరుగా మాట్లాడి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులను కోరారు. విద్యార్థులు కోలుకునే వరకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడవద్దని డీఈవో భరోసా ఇచ్చారు.
News January 21, 2026
NLG: మహిళా సాధికారతే లక్ష్యం: కలెక్టర్ చంద్రశేఖర్

గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు డిపిఎంలు, ఏపీఎంలు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల బలోపేతం, ‘ఉల్లాస్ అక్షరమాల’ ద్వారా వంద శాతం అక్షరాస్యత సాధించాలని సూచించారు. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణాలు, ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలన్నారు.
News January 21, 2026
NLG: శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ వద్దు: ఎస్పీ పవార్

నల్గొండ జిల్లాలో నేరాల అదుపునకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేయాలని సూచించారు. బాధితుల ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి, సైబర్ నేరాల పట్ల ఉక్కుపాదం మోపాలని సూచించారు.


