News August 12, 2024
ముగిసిన ఒలింపిక్స్.. ఏర్పాట్లపై మళ్లీ విమర్శలు

పారిస్ ఒలింపిక్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. అయితే, అథ్లెట్లకు సరైన వసతులు కల్పించలేదని నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఈక్రమంలో గోల్డ్ మెడలిస్ట్ పార్క్‌లో నిద్రపోయిన ఫొటోను షేర్ చేస్తూ అథ్లెట్లు ఉక్కపోతతో ఇబ్బందిపడ్డారని గుర్తుచేస్తున్నారు. భారత అథ్లెట్లూ ఇబ్బంది పడితే కేంద్రం పోర్టబుల్ ఏసీలు పంపింది. వసతులు బాలేకపోవడంతో కొందరు అమెరికన్ అథ్లెట్లు హోటల్స్‌లో ఉండాల్సి వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News September 19, 2025
బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా?

రోజులో చాలా ముఖ్యమైన మీల్ బ్రేక్‌ఫాస్ట్. కానీ, చాలామంది దానిని స్కిప్ చేస్తుంటారు. నైట్ ఎక్కువ తిన్నారనో, బరువు తగ్గాలనో కారణం ఏదైనా టిఫిన్ చేయడం మానేస్తారు. దాంతో మెదడుకు కావాల్సిన ఎనర్జీ దొరక్క ఏకాగ్రత లోపిస్తుంది. బ్లోటింగ్, అజీర్తి, గుండె సమస్యలు వస్తాయి. బరువు కూడా పెరుగుతారు. మరోవైపు టిఫిన్ ఆలస్యంగా చేస్తే ఆయుష్షు 8-10 శాతం తగ్గుతుందని మాంచెస్టర్ యూనివర్సిటీ స్టడీ చెబుతోంది. SHARE IT.
News September 19, 2025
నేడు ఒమన్‌తో భారత్ మ్యాచ్

ఆసియా కప్‌లో భారత్ ఆఖరి గ్రూప్ మ్యాచ్‌కి రెడీ అవుతోంది. నేడు దుబాయ్ వేదికగా ఒమన్‌తో SKY సేన తలపడనుంది. ఇప్పటికే PAK, UAEలపై గ్రాండ్ విక్టరీలు సాధించిన IND సూపర్-4కి చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇవాళ్టి నామమాత్రపు మ్యాచును సూపర్-4కి ప్రాక్టీస్‌గా ఉపయోగించుకోనుంది. ఈమేరకు జట్టులో పలు మార్పులు చేసే ఛాన్సుంది. బుమ్రా, కుల్దీప్/వరుణ్‌లకు రెస్ట్ ఇచ్చే అవకాశముంది. మ్యాచ్ రా.8గంటలకు ప్రారంభమవుతుంది.
News September 19, 2025
రాబోయే 4 రోజులు వర్షాలు

APలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో రాబోయే 4 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. నేడు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు-భారీ వర్షాలు, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, GNT, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. TGలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.