News August 13, 2024
నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్లు మూసివేత

నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను అధికారులు నిలిపేశారు. సోమవారం మధ్యాహ్నం వరకు 18 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అనంతరం అన్ని గేట్లను మూసి వేశారు. నాగార్జునసాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 588.80 అడుగులుగా ఉంది. అదే విధంగా గరిష్ఠ నీటినిల్వ 312.50 టీఎంసీలు కాగా, ఇప్పుడు 305.46 టీఎంసీలు ఉన్నాయి.
Similar News
News January 10, 2026
నల్గొండ జిల్లాలో టుడే టాప్ న్యూస్

దేవరకొండ: మద్యం మత్తులో 100కు డయల్.. ఏమైందంటే..
నల్గొండ: ఎన్జీ కళాశాలలో ముగిసిన జాతీయ సదస్సు
నార్కట్‌పల్లి: చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష
నల్గొండ: పురపోరుకు ఎర్రజెండా సైన్యంసై
నార్కట్ పల్లి: చెరువుగట్టు జాత తేదీల ప్రకటన
నల్గొండ : జిల్లా వ్యాప్తంగా పెరిగిన నిఘా
మిర్యాలగూడ : కొత్తగా మిర్యాలగూడ జిల్లా?
నల్గొండ : నాలుగు నెలలు ఆగాల్సిందే..
నల్గొండ : తెరపడిన మదర్ డెయిరీ వివాదం
News January 9, 2026
నల్గొండ: ప్రభుత్వ భవనాలపై నివేదిక ఇవ్వండి: అదనపు కలెక్టర్

జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల భవనాల స్థితిగతులపై సమగ్ర నివేదిక సమర్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ వార్డు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో 7 మున్సిపాలిటీల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అద్దె భవనాల భారం తగ్గించి, ప్రభుత్వ భవనాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడమే లక్ష్యమని స్పష్టం చేశారు. పాత భవనాలకు మరమ్మతులు చేపట్టాలని తెలిపారు.
News January 9, 2026
నార్కట్‌పల్లి: చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువుగట్టులో జనవరి 23 నుంచి 30 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొని ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.


