News August 13, 2024

షేక్ హసీనా ఎత్తుగడ ఇదేనా?

image

బంగ్లాదేశ్‌లో రీఎంట్రీకి షేక్ హసీనా రంగం సిద్ధం చేసుకుంటున్నారని జియో పొలిటికల్ అనలిస్టుల అంచనా. సెయింట్ మార్టిన్ దీవి సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టలేక, తన ప్రజల అంత్యక్రియల పర్వాన్ని చూడొద్దనే పదవి నుంచి దిగిపోయానన్న ఆమె మాటల్నే ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఒకవేళ యూనస్ ప్రభుత్వం దీవిని USకు అప్పగిస్తే మళ్లీ ఎన్నికల్లో ఇదే అవామీ లీగ్ ప్రచారాస్త్రం అవుతుందని, ప్రజలు ఆలోచిస్తారని చెబుతున్నారు.

Similar News

News January 20, 2025

బంగాళదుంపలు రోజూ తింటున్నారా?

image

బంగాళదుంపలను ఆహారంలో రోజు కాకుండా వారానికి రెండు, మూడు రోజులు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటికి వేడి స్వభావం ఉండటం వల్ల వాంతులు, విరేచనాలతో పాటు జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశముందని అంటున్నారు. రక్తపోటు, మధుమేహ సమస్యలు ఉన్న వారు తినడం తగ్గించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వీటిని నూనెలో వేయించి తినడం కంటే ఉడకబెట్టుకొని తినడం మేలు అని చెబుతున్నారు.

News January 20, 2025

కొత్త ఫోన్‌తో ఎర.. రూ.2.8 కోట్లు టోకరా

image

బెంగళూరులో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. లాటరీలో మొబైల్ గెలుచుకున్నారంటూ ఓ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌కి కొరియర్‌లో ఫోన్ పంపారు. నిజమేనని నమ్మిన అతను కొత్త ఫోన్‌లో సిమ్ వేశాడు. ఇదే అదనుగా నేరగాళ్లు మొబైల్‌ను తమ అధీనంలోకి తీసుకొని ఖాతా నుంచి రూ.2.8 కోట్ల నగదు కాజేశారు. మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోలీసులను ఆశ్రయించాడు.

News January 20, 2025

సంజయ్ రాయ్‌కి నేడు శిక్ష ఖరారు

image

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కి సీల్దా కోర్టు నేడు శిక్ష ఖరారు చేయనుంది. గతేడాది AUG 9న RGకర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినిని రేప్ చేసి చంపేశారు. ఈ కేసులో అక్కడ పనిచేసే సంజయ్ రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం 3 రోజుల క్రితం కోర్టు అతడిని దోషిగా తేల్చింది. అటు దీని వెనుక మరింత మంది ఉన్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.