News August 13, 2024

ఎన్టీఆర్: రెవెన్యూ సదస్సులపై కలెక్టర్ కీలక ప్రకటన

image

ఎన్టీఆర్ జిల్లాలో ఈ నెల 16 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ సృజన తెలిపారు. మొత్తం 45 రోజుల పాటు ఈ సదస్సులు జరుగుతాయని, ఈ సదస్సులో స్వీకరించిన ప్రతి అర్జీకి రిజిస్టర్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందని ఆమె సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సదస్సులపై ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు సంబంధిత అధికారులు సమీక్షలు నిర్వహిస్తారని, నివేదికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

Similar News

News July 6, 2025

వీరపనేనిగూడెంలో ప్రమాదం.. ఒకరి మృతి

image

గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో తెంపల్లికి చెందిన షేక్ యూసఫ్ బాషా (28) మృతి చెందాడు. తాపీ పని ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, ఇటుకబట్టీల వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News July 5, 2025

ఫెన్సింగ్ పోటీల్లో కృష్ణా జిల్లా క్రీడాకారుల ప్రతిభ

image

మహారాష్ట్రలోని నాసిక్‌లో జరుగుతున్న 9వ జాతీయ ఫెన్సింగ్ పోటీల్లో కృష్ణా జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో వారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ పోటీలకు ఎంపికైనట్లు కోచ్ విజయ్ తెలిపారు. జాతీయ ఫెన్సింగ్‌ పోటీల్లో పాల్గొనడం ద్వారా జిల్లా క్రీడా కారులు తమ ప్రతిభను దేశస్థాయిలో చాటుకున్నారని కోచ్ చెప్పారు.

News July 5, 2025

పీ-4 కార్యక్రమం నిర్వహణకు కలెక్టర్ ఆదేశాలు

image

పీ-4, స్వర్ణాంధ్ర-2047 కార్యక్రమాల అమలులో భాగంగా, ఆగస్టు 15వ తేదీలోగా బంగారు కుటుంబాల అనుసంధాన ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ ‘మీ-కోసం’ సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే 67 వేల బంగారు కుటుంబాలను గుర్తించినట్లు తెలిపారు.