News August 13, 2024
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీకి టీడీపీ దూరం
AP: సీఎం చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్థానిక సంస్థల MLC ఉప ఎన్నికలో పోటీ చేయట్లేదని ప్రకటించారు. కొన్ని రోజులుగా పోటీలో నిలిపేందుకు ఆయన సమాలోచనలు చేశారు. వైసీపీకి మెజార్టీ సభ్యుల మద్దతు ఉండటంతో పోటీ చేయకపోవడమే మంచిదని నిర్ణయించారు. దీంతో YCP అభ్యర్థి బొత్స ఎన్నిక లాంఛనమే. స్వతంత్ర అభ్యర్థిగా షేక్ సఫీ నామినేషన్ వేశారు. ఆయన ఉపసంహరించుకుంటే ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
Similar News
News January 20, 2025
రాహుల్ గాంధీకి ఊరట కల్పించిన సుప్రీంకోర్టు
పరువునష్టం కేసు ప్రొసీడింగ్స్‌ను నిలిపేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. 2018 నాటి కాంగ్రెస్ ప్లీనరీలో HM అమిత్ షా ‘హత్యకేసులో నిందితుడు’ అని RG ఆరోపించారు. దీంతో ఆయనపై BJP నేత నవీన్ ఝా దావా వేశారు. తన వ్యాఖ్యలు రాజకీయ పరమైనవంటూ 2024 FEBలో రాహుల్ వేసిన క్వాష్ పిటిషన్‌ను ఝార్ఖండ్ హైకోర్టు కొట్టేసింది. కేసుపై మరింత పరిశీలన అవసరమని నేడు సుప్రీంకోర్టు పేర్కొంది.
News January 20, 2025
ప్రముఖ నటుడు గుండెపోటుతో కన్నుమూత
ప్రముఖ నటుడు విజయ రంగరాజు కన్నుమూశారు. చెన్నైలో గుండెపోటుకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే రంగరాజు ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. బాలకృష్ణ నటించిన భైరవద్వీపంతో పాపులర్ అయ్యారు. తర్వాత యజ్ఞం, సీమశాస్త్రి, జాంబిరెడ్డి, ఢమరుకం, శ్లోకం, మగరాయుడు, విశాఖ ఎక్స్‌ప్రెస్, మేడం సహా పలు సినిమాల్లో విజయ రంగరాజు నటించారు.
News January 20, 2025
Paytm Q3 Results: తగ్గిన నష్టం, పడిపోయిన ఆదాయం
Q3లో ఫిన్‌టెక్ మేజర్ Paytm నికర నష్టం రూ.219 కోట్ల నుంచి రూ.208 కోట్లకు తగ్గింది. ఆదాయంలో మాత్రం 36% మేర కోతపడింది. గత ఏడాది ఇదే సమయంలోని రూ.2,851 కోట్ల నుంచి రూ.1,828 కోట్లకు పడిపోయింది. GMV, చందాదారుల పెరుగుదలతో QoQ పద్ధతిన రెవెన్యూ 10% ఎగిసింది. నగదు రూ.2,851 కోట్లు పెరిగి రూ.12,850 కోట్లుగా ఉంది. PAYPAYలో వాటా విక్రయమే ఇందుకు కారణం. నేడు ఈ షేర్లు 1.35% ఎగిసి రూ.912 వద్ద ట్రేడవుతున్నాయి.