News August 13, 2024

15న స్విమ్స్ ఓటీ, ఓపీలకు సెలవు

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈనెల 15వ తేదీన తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ఓటీ, ఓపీలకు సెలవు ప్రకటించారు. అత్యవసర సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ వివరించారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరారు.

Similar News

News November 14, 2025

ప్రజలకు రక్షణ కల్పించడమే లక్ష్యం: SP

image

ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసు శాఖ ధృడ సంకల్పమని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. చిత్తూరులోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. సీసీ కెమెరాల నియంత్రణ, ట్రాఫిక్ మానిటరింగ్ వ్యవస్థ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజం వంటి అంశాలను పరిశీలించారు. డయల్ 112 విభాగాన్ని తనిఖీ చేశారు. సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి కాల్ ఎంతో ముఖ్య ఉంటుందని చెప్పారు.

News November 14, 2025

సోమల: ట్రాక్టర్ కిందపడి కూలి మృతి

image

దుక్కులు దున్నుతూ ట్రాక్టర్ కింద పడి కూలి మృతి చెందిన ఘటన సోమల మండలంలో జరిగింది. ఎస్ఐ శివశంకర్ కథనం మేరకు.. బోనమందకు చెందిన రామచంద్ర (43) మామిడి తోటలో కూలిగా పని చేస్తున్నాడు. తోటలో ట్రాక్టర్ దుక్కులు దున్నుతుండగా డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు గుంతలో దిగి ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్ కింద పడడంతో రామచంద్ర మృతి చెందాడు. డ్రైవర్ దూకి వేయడంతో అతనికి ప్రమాదం తప్పింది.

News November 13, 2025

MP మిథున్ రెడ్డికి జనసేన కౌంటర్

image

మిథున్ రెడ్డి సోషల్ మీడియాలో బుకాయిస్తే ఆయన తండ్రి <<18276752>>ఆక్రమణలు <<>>సక్రమం కావని జనసేన విమర్శించింది. ‘1968 SEP 16న మంగళంపేట ఫారెస్ట్ గెజిట్ ప్రకారం 76ఎకరాలున్న మీ భూమి 103.98 ఎకరాలు ఎలా అయ్యిందో చెబుతారా మిథున్ రెడ్డి. అడవిని ఎలా కబ్జా చేశారో మీ తండ్రిని అడగండి. 32.63ఎకరాల అడవిని కబ్జా చేసేసినంత ఈజీ కాదు చట్టం నుంచి తప్పించుకోవడం. కాసేపట్లో మీ కబ్జా చిట్టా బయటికి వస్తుంది’ అని ట్వీట్ చేసింది