News August 13, 2024

కృష్ణా: APSSDC ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్ కోర్సులలో ఉచిత శిక్షణ

image

విజయవాడ SRR & CVR కళాశాలలో జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోర్సులలో 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో ఇచ్చే ఈ శిక్షణకు ఇంటర్, డిగ్రీ పాసైన విద్యార్థులు ఈ నెల 19లోపు SRR కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి చెప్పారు. శిక్షణ పూర్తైన అనంతరం APSSDC సర్టిఫికెట్లు ప్రధానం చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.

Similar News

News May 7, 2025

కృష్ణా: మే 11న ఆదర్శ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు 

image

PM సూర్యఘర్ పథకం మంజూరు కోసం జిల్లాలో ఎంపిక చేసిన తొమ్మిది ఆదర్శ గ్రామాల్లో మే 11వ తేదీన ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు సంసిద్ధం కావాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో CPDCL ఆధ్వర్యంలో PM సూర్య ఘర్ పథకంపై అధికారులు, బ్యాంకర్లకు ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించి పలు సూచనలు చేశారు. 

News May 7, 2025

పాకిస్తాన్ వ్యక్తులు భారత్ వదిలిపెట్టి వెళ్లాలి: ఎస్పీ

image

కృష్ణా జిల్లాలో పాకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారు తప్పకుండా 27వ తేదీలోపు భారత్‌ను విడిపోవాల్సి ఉంటుందని ఎస్పీ ఆర్. గంగాధర్ రావు పేర్కొన్నారు. ఈ నియమాన్ని పాటించని వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అటువంటి వ్యక్తులు వెంటనే తమ సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్‌లకు తెలియజేసి, దేశం విడిచి వెళ్లాలన్నారు. 

News May 7, 2025

గ్రామాభివృద్ధిపై డీపీఆర్ తయారు చేయండి: కలెక్టర్

image

కూచిపూడి గ్రామాన్ని రాష్ట్ర వారసత్వ సంపద గల ప్రాంతంగా అభివృద్ధి చేయుటకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (DPR)ను వారం రోజుల లోపు తయారు చేసి అందజేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కూచిపూడి ప్రాంత అభివృద్ధి పనులపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.