News August 13, 2024

పలాస వద్ద వ్యాన్ బోల్తా

image

పలాస మండలం నీలావతి గ్రామ జంక్షన్ సమీప జాతీయ రహదారిపై మంగళవారం ఓ బొలెరో వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి అక్రమంగా పశువులను తిలారు సంతకు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు, పశువులు క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాన్ని రహదారి పక్కకు తరలించారు.

Similar News

News September 18, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤ టెక్కలి, జలుమూరు, పాతపట్నం, పొందూరు, శ్రీకాకుళానికి నూతన ఎంపీడీఓలు
➤అరసవల్లి: ఘనంగా ఆదిత్యుని కళ్యాణం.
➤అధ్వానంగా ముంగెన్నపాడు రోడ్డు.
➤ శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల విశ్వకర్మ జయంతి.
➤నరసన్నపేట: ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు.
➤ఇచ్ఛాపురంలో గంజాయితో ఇద్దరు అరెస్ట్.
➤శ్రీకాకుళం: వైసీపీ ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశం
➤ మా శత్రువు టీడీపీనే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

News September 17, 2025

శ్రీకాకుళం జిల్లాలో భారీగా పడిపోయిన బంతి పూల ధరలు

image

శ్రీకాకుళం జిల్లాలో బంతి పూల ధరలు భారీగా పడిపోయాయి. గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వినాయక చవితి సమయంలో కిలో రూ.50-60 పలకగా ఆ తర్వాత ధర క్రమంగా తగ్గిపోయింది. ప్రస్తుతం కేజీకి రూ.20 కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కిలోకు రూ. 35-40 వరకూ వస్తే పెట్టుబడులైనా దక్కుతాయని అంటున్నారు. రాబోయే దసరా సీజన్ పైనే బంతిపూల రైతులు ఆశలు పెట్టుకున్నారు.

News September 17, 2025

టెక్కలి: జిల్లా ఆసుపత్రిలో నిలిచిపోయిన సీటీ స్కాన్ సేవలు

image

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో సీటీ స్కాన్ సేవలు గత 2 రోజులుగా నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.అత్యవసర కేసులు మినహా మిగతా కేసులకు సీటీ స్కాన్ సేవలు నిలిపివేయడంతో పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా సీటీ స్కాన్ సేవలు అందుతున్న విషయం విదితమే. సంస్థకు ప్రభుత్వం నుంచి బకాయిలు పెండింగ్ ఉండడంతో సేవలు నిలిపివేసినట్లు స్థానికులు అంటున్నారు.