News August 13, 2024
WGL: రూ.1,500 పెరిగిన వండర్ హాట్ మిర్చి

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నేటితో పోలిస్తే ఈరోజు వండర్ హాట్ మిర్చి ధర భారీగా పెరిగింది. నిన్న రూ.14,500 పలికిన వండర్ హాట్(WH) మిర్చి నేడు రూ.16 వేలకు పెరిగింది. అలాగే తేజ మిర్చి నిన్నటిలాగే రూ.18,000 పలికింది. 341 రకం మిర్చికి సైతం నిన్నటిలాగే రూ.15,800 ధర వచ్చిందని మార్కెట్ వ్యాపారులు తెలిపారు.
Similar News
News November 10, 2025
సమగ్ర అభివృద్ధి కోసం పని చేయాలి: కలెక్టర్

వరంగల్ కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన డీఆర్డీఏ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రతి శాఖ తమ ప్రణాళికలను సమయపాలనతో అమలు చేస్తేనే గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలపడుతుందని సూచించారు.
News November 10, 2025
పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై మంత్రుల సమీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణతో పాటు పత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు కొనుగోళ్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. రైతులకు మద్దతు ధర అందేలా, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
News November 10, 2025
వరంగల్ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం

వరంగల్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రజల నుంచి వివిధ వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యలను ఓర్పుతో విన్న కలెక్టర్ సంబంధిత శాఖాధికారులను పిలిపించి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల అర్జీలకు తక్షణ స్పందనతో వ్యవహరించడం ప్రజల్లో సంతృప్తిని కలిగించింది.


