News August 13, 2024

రాందేవ్‌ బాబాకు సుప్రీం కోర్టులో ఊరట

image

‘పతంజలి’ వ్యవస్థాపకుడు, యోగా గురువు బాబా రాందేవ్‌, MD బాలకృష్ణకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. పతంజలి క్షమాపణను ఎట్టకేలకు అంగీకరించిన న్యాయస్థానం కోర్టు ధిక్కరణ కేసును ముగిస్తూ తీర్పు వెలువరించింది. కాగా గతంలో పతంజలి ఉత్పత్తుల గురించి తప్పుడు ప్రకటనలు చేసిందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిల్ వేసింది. దీంతో అసత్య ప్రకటనలు మానుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని పతంజలిని SC అప్పట్లో ఆదేశించింది.

Similar News

News January 15, 2025

భారత్ ఘన విజయం

image

ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. 436 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఐరిష్ జట్టును 131 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో 304 రన్స్ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. వన్డేల్లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. ఇండియా బౌలర్లలో దీప్తి 3, తనూజ 2, సాధు, సయాలి, మిన్నూ తలో వికెట్ పడగొట్టారు. మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది.

News January 15, 2025

ఆకట్టుకుంటోన్న స్పెషల్ బాబాలు

image

మహా కుంభమేళాకు వచ్చిన స్పెషల్ బాబాలు ఆకట్టుకుంటున్నారు. అందులో ఐఐటియన్ బాబా, 14 ఏళ్లుగా ఒక చేయిని పైకి ఎత్తి అలాగే ఉంచేసిన రాధే పురీ బాబా, పురాతన కారులో వచ్చిన అంబాసిడర్ బాబా, తలపై వరి, మిల్లెట్ మొక్కలు పెంచే అనాజ్ వాలే బాబా, చాయ్ వాలే బాబా, 32 ఏళ్లుగా స్నానం ఆచరించని 3.8 ఫీట్ బాబా, తలపై 2 లక్షల రుద్రాక్షలు ధరించిన గీతానంద గిరి బాబా, తలపై పావురం కలిగి ఉన్న మహంత్ రాజ్‌పురీ జీ మహారాజ్ ఉన్నారు.

News January 15, 2025

నామినేషన్ వేసిన కేజ్రీవాల్

image

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ వేశారు. తన భార్య, పార్టీ నేతలు, అభిమానులు వెంట రాగా ఆయన నామినేషన్ ఫైల్ చేశారు. త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మూడుసార్లు సీఎంగా చేసిన ఆయన లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ కావడంతో ఇటీవలే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.