News August 13, 2024

మాజీ డీహెచ్ శ్రీనివాసరావు స్వచ్ఛంద పదవీ విరమణ

image

ప్రజారోగ్యశాఖ మాజీ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అదనపు పబ్లిక్ హెల్త్ ఆఫీసర్, జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్న ఆయన 2018 మే నుంచి 2023 డిసెంబరు వరకు రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2023 డిసెంబరు 20 నుంచి సెలవులో ఉన్నారు.

Similar News

News September 19, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై నేడు కేటీఆర్ సమావేశం

image

నేడు BRS నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చర్చించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జూబ్లీహిల్స్‌లోని ముఖ్య నేతలతో ఇవాళ సమావేశం కానున్నారు. అభ్యర్థితో పాటు గ్రౌండ్ లెవెల్‌లో పనిచేసి విజయం సాధించడానికి చేయాల్సి కార్యచరణపై ఇవాళ చర్చించనున్నారు.

News September 19, 2025

వారంలో మూడు రోజులు ముచ్చింతల్‌కు బస్సులు

image

ఆధ్యాత్మిక కేంద్రం ముచ్చింతల్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు. ఈ నెల 20 నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. JBS, ఆఫ్జల్‌గంజ్‌, సికింద్రాబాద్‌, KPHB, ఉప్పల్‌, రిసాలాబజార్‌ ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతామన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సౌకర్యం ఉంటుందని వివరించారు.  

News September 19, 2025

కోకా‌పేట్‌లో భర్తను చంపిన భార్య

image

కోకాపేట్‌లో భర్తను భార్య హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల ప్రకారం.. గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్తపై భార్య కత్తితో దాడి చేసింది. ఇంట్లో నుంచి కేకలు రావడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వారిని అస్సాంకి చెందిన వారిగా గుర్తించారు. భార్యాభర్తల మధ్య విభేదాలే ఈ దారుణానికి దారితీసింది.