News August 13, 2024
‘ఫస్ట్ క్రై’తో సచిన్‌కు రూ. కోట్ల లాభం

స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయిన ‘ఫస్ట్ క్రై’ అదరగొడుతుండటంతో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దంపతులు భారీ లాభాలను సంపాదించారు. ఒక్కో షేర్‌కు రూ.487.44 చొప్పున 2 లక్షల షేర్లను సుమారు రూ.10కోట్లకు వారు కొనుగోలు చేశారు. గ్రే మార్కెట్ ప్రీమియం ప్రకారం వారికి భారీ నష్టం వాటిల్లుతుందని అందరూ అంచనా వేశారు. కానీ నేడు షేర్లు రూ.651తో లిస్ట్ కావడంతో రూ.3కోట్లకు పైగా లాభాన్ని చవిచూశారు.
Similar News
News September 16, 2025
GST ఎఫెక్ట్.. ధరలు తగ్గించిన మదర్ డెయిరీ

GST శ్లాబులను సవరించిన నేపథ్యంలో పాలు, పాల ఉత్పత్తుల ధరలను తగ్గించినట్లు మదర్ డెయిరీ ప్రకటించింది. ఈ నెల 22 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. లీటర్ పాల ధర ప్రస్తుతం రూ.77 ఉండగా రూ.75కు తగ్గించామని తెలిపింది. నెయ్యి, వెన్న, ఐస్‌క్రీమ్స్ రేట్లనూ తగ్గించినట్లు వెల్లడించింది. పాలపై సున్నా, మిగతా ఉత్పత్తుల(పనీర్, బట్టర్, చీజ్, మిల్క్ షేక్స్, ఐస్‌క్రీమ్స్)పై 5% జీఎస్టీ ఉంటుందని తెలిపింది.
News September 16, 2025
ఇండియా జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్?

టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్ కంపెనీ వ్యవహరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ఆ సంస్థ ఒక్కో మ్యాచుకు రూ.4.5 కోట్లు BCCIకి చెల్లించనున్నట్లు తెలుస్తోంది. 121 ద్వైపాక్షిక మ్యాచులు, 21 ఐసీసీ మ్యాచులకు కలిపి రూ.579 కోట్లకు స్పాన్సర్ హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం. 2027 వరకు స్పాన్సర్‌గా ఉండనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
News September 16, 2025
వివేకా హత్య కేసు: బెయిల్ రద్దుపై జోక్యం చేసుకోలేమన్న SC

AP: వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి దర్యాప్తు చేయాలన్న పిటిషనర్ సునీత వాదనపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. ట్రయల్ కోర్టులో మరో పిటిషన్ వేయాలని సూచించింది. పిటిషన్ వేసిన 8 వారాల్లో మెరిట్స్ ఆధారంగా నిర్ణయం ప్రకటించాలని, ట్రయల్ కోర్టును ఆదేశించింది.