News August 13, 2024
విజయనగరంలో రెండు.. పార్వతీపురంలో జీరో

విజయనగరం జిల్లా కేంద్రంలో రెండు అన్న క్యాంటీన్ల ప్రారంభానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అదే రోజు జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రకాశం పార్క్ వద్ద అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. కాగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఆ రోజు ఎక్కడా అన్న క్యాంటీన్లు ప్రారంభం కావడం లేదు.
Similar News
News September 18, 2025
VZM: ఓపెన్ కేటగిరి బార్లకు లాటరీ విధానం ద్వారా ఎంపిక

జిల్లాలో ఓపెన్ కేటగిరి బార్లకు లాటరీ విధానం ద్వారా ఎంపిక ప్రక్రియ బుధవారం విజయవంతంగా పూర్తయింది. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, జేసీ సేతు మాధవన్ సమక్షంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 16 అప్లికేషన్లు అందగా, వాటి ద్వారా రూ.81.6 లక్షలు వచ్చాయని జిల్లా అబ్కారీ శాఖ అధికారి బమ్మిడి శ్రీనాథుడు తెలిపారు. లాటరీ ప్రక్రియలో జిల్లాలో నాలుగు బార్లకు ఎంపిక జరిగిందన్నారు.
News September 18, 2025
సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకూడదు: VZM కలెక్టర్

శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రతి ఒక్కరి మదిలో పవిత్రంగా నిలిచిపోయేలా నిర్వహించాలని, పండగ శోభ ప్రతిబింబించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. పండగ ఏర్పాట్లపై కలెక్టర్ గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. సిరిమాను పవిత్రతను కాపాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. VIP దర్శనాలు వలన సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకూడదన్నారు.
News September 18, 2025
పూసపాటిరేగ: వేటకు వెళ్లి మృతి

పూసపాటిరేగ మండలం పెద్దూరుకు చెందిన ఓ మత్స్యకారుడు వేటకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మత్స్యకారుడైన బి.రాము బుధవారం వేటకు వెళ్లగా.. చేపల కోసం వల వేసే క్రమంలో జారి పడిపోయాడు. అక్కడున్నవారు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈ ఘటనపై మెరైన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.