News August 13, 2024
వైద్య కళాశాలలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు: కలెక్టర్ నారాయణ రెడ్డి
నల్గొండలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్( తాత్కాలిక) పద్ధతిలో 100 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ప్రొఫెసర్-7, అసోసియేట్ ప్రొఫెసర్ -17,అసిస్టెంట్ ప్రొఫెసర్ -43, సీనియర్ రెసిడెంట్- 33 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 17న కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు.
Similar News
News November 25, 2024
చింతలపాలెంతో నాకు 30 సంవత్సరాల అనుబంధం :మంత్రి ఉత్తమ్
చింతలపాలెం మండలంతో తనకు 30 సంవత్సరాల అనుబంధం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిన్న చింతలపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో చింతలపాలెం మండలానికి రెండు కోట్లతో సీసీ రోడ్డు మంజూరు చేయించానన్నారు.మండలం అభివృద్ధికి ఎల్లపుడూ కృషి చేస్తానని తెలిపారు.
News November 25, 2024
నల్గొండ: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్
విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనాన్ని పెట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా తృప్తి అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతి బాపూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల వంటగదిని, డైనింగ్ హాల్, పరిసరాలను, ఆటస్థలాన్ని, తరగతి గదులను తనిఖీ చేయడమే కాకుండా విద్యార్థినులు, వంట వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా వారితో కలిసి భోజనం చేశారు.
News November 24, 2024
NLG: సర్పంచుల సంఘం జేఏసీ నాయకుల ముందస్తు అరెస్ట్
సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని HYDలోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపి ప్రెస్ మీట్‌కి వస్తే పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం JAC నాయకులు తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదల చేయనప్పటికీ, రూ.750 కోట్లు విడుదల చేశామని సీఎం అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో పలువురు ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ సర్పంచులు ఉన్నారు.