News August 14, 2024

పోలీసులు నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి: ఎస్పీ గౌతమ్

image

సమాజంలో నేరాల నియంత్రణపై పోలీస్ అధికారులు దృష్టి సారించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు మంగళవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించేలా కృషిచేయాలని, కోర్టు అధికారులను సమన్వయపరుస్తూ కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు.

Similar News

News November 28, 2024

MBNR: నూనెపడి విద్యార్థినికి గాయాలు.. స్పెషల్ ఆఫీసర్ సస్పెన్షన్

image

నవాబ్‌పేటలోని కేజీబీవీ పాఠశాలలో 9వ తరగతి <<14727126>>విద్యార్థిని జల్సా <<>>పై వేడి నూనెపడి గాయాలైన గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తహాశీల్దార్ శ్రీనివాసులును విచారణకు ఆదేశించారు. తహశీల్దార్ నివేదిక ఆధారంగా పాఠశాల ఇన్‌ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ ప్రశాంతిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. విచారణ సమయంలో హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ల కూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News November 28, 2024

MBNR: నేడు పాలమూరుకు మంత్రులు రాక

image

MBNR జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌లో రేపటి నుంచి మూడు రోజులపాటు రైతు పండుగ నిర్వహిస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గురువారం ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని రైతులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

News November 28, 2024

MBNR: GET READY.. రేపటి నుంచి రైతు పండుగ

image

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌ మైదానంలో గురువారం నుంచి మూడు రోజులపాటు “రైతు పండుగ” ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. రైతులకు అవగాహన కల్పించేలా సంబంధిత శాఖల ఆధ్వర్యంలో 150 స్టాల్స్ ఏర్పాటు చేశారు. బుధవారం రైతు పండుగ సభకు సంబంధించిన పలు అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు.