News August 14, 2024

చిత్తూరు: పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

స్వాతంత్ర దినోత్సవ నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. మంత్రి సత్య కుమార్ వేడుకలకు హాజరుకానున్నట్టు ఆయన చెప్పారు. శకటాల ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమాలను వీక్షించేందుకు వచ్చే ప్రజలకు అన్ని వసతులు కల్పించాలన్నారు.

Similar News

News January 13, 2026

చిత్తూరులో మహిళ మృతి

image

చిత్తూరులో గుర్తుతెలియని మహిళ మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. పట్టణంలోని పీసీఆర్ సర్కిల్లో 45 నుంచి 50 సంవత్సరాల లోపు వయసున్న మహిళ మృతి చెంది ఉండగా స్థానికులు గుర్తించారు. పోలీసులు విచారించగా రెండు రోజులుగా అదే ప్రాంతంలో ఆమె ఉన్నట్టు, ఆరోగ్యం క్షీణించి మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలిసినవారు 08572 234100 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News January 13, 2026

చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ కీలక ఆదేశాలు

image

చిత్తూరు జిల్లాలో ఎక్కడ జల్లికట్టు, కోడిపందాలు, పేకాట నిర్వహించకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం ఆదేశించారు. ఎక్కడైనా నిర్వహించే అవకాశం ఉంటే 112 కు లేదా 9440900005 ఫోన్ లేదా మెసేజ్ చేయాలని సూచించారు. తమ సిబ్బంది వెంటనే చేరుకొని చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

News January 13, 2026

చిత్తూరు: కరెంట్ వైర్లతో జాగ్రత్త..!

image

సంక్రాంతి సందర్భంగా కరెంట్ వైర్లకు దూరంగా గాలిపటాలు ఎగురవేయాలని చిత్తూరు ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ సూచించారు. గాలిపటాలు కరెంటు వైర్ల మధ్య చిక్కుకున్నప్పుడు వాటిని తీయకూడదని స్పష్టం చేశారు. ట్రాన్స్ ఫార్మర్లు, సబ్ స్టేషన్లకు దూరంగా ఎగురవేయాలని, లోహపు దారాలతో పతంగులు ఎగరవేయరాదని కోరారు. ప్రమాదాలు జరిగితే టోల్ ఫ్రీ 1912కు ఫోన్ చేయాలన్నారు.