News August 14, 2024
విద్యాశాఖ మంత్రితో విశాఖ నార్త్ ఎమ్మెల్యే భేటీ

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌తో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు అమరావతిలో మంగళవారం భేటీ అయ్యారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యపై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు.
Similar News
News February 19, 2026
విశాఖ వచ్చిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

విశాఖలో జరుగుతున్న ఐఎఫ్ఆర్ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం విశాఖ వచ్చారు. ఆయనకు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పలువురు నేవీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. విశాఖలో ఐఎఫ్ఆర్ వేడుకల్లో పాల్గొని సాయంత్రం తిరుగు ప్రయాణంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.
News February 19, 2026
ఎంవీపీ: ప్లాస్టిక్ కవర్ల వాడకం.. రూ.1000 జరిమానా

జీవీఎంసీ అదనపు కమిషనర్ నల్లనయ్య గురువారం 18వ వార్డులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తున్న రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ షాపుల యజమానులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఒక్కొక్కరికి రూ. 1000 జరిమానా విధించారు. ప్లాస్టిక్ రహిత నగరమే లక్ష్యమని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.
News February 19, 2026
మారికవలసలో యువకుడి ఆత్మహత్య

మధురవాడలోని పి.ఎమ్.పాలెం పోలీస్ స్టేషన్ పరిధి మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీలో విషాదం చోటుచేసుకుంది. కాలనీలో బ్లాక్ నంబర్ 88లో నివాసముంటున్న పీల శివ (19) బుధవారం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.


