News August 14, 2024
సరిపోదా శనివారం.. వాట్ ఏ వేరియేషన్

వివేక్ ఆత్రేయ, నాని కాంబినేషన్లో తెరకెక్కిన రెండో చిత్రం ‘సరిపోదా శనివారం’. మొదటి సినిమా ‘అంటే సుందరానికి’ పూర్తి క్లాస్‌గా ఉంటుంది. రెండోది మాత్రం భిన్నంగా యాక్షన్, ఎమోషనల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కినట్లు ట్రైలర్‌లో తెలుస్తోంది. ఆత్రేయ నుంచి ఈ వేరియేషన్ ఊహించలేదని, నానికి అదిరిపోయే రోల్ పడినట్లుగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సారి బాక్సాఫీస్‌పై దండయాత్ర తప్పదని పోస్టులు చేస్తున్నారు.
Similar News
News January 13, 2026
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ Y పోస్టులు

<
News January 13, 2026
భోగి మంటలు ఎందుకు వెలిగిస్తారు?

దక్షిణాయనంలో సూర్యుడు దూరమవ్వడం వల్ల చలి విపరీతంగా పెరుగుతుంది. ఆ చలిని తట్టుకోవడానికి, ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతూ ఈ మంటలు వేస్తారు. ఈ మంటలు చలి నుంచి రక్షణనిస్తూ శరీరానికి వెచ్చదనం ఇస్తాయి. అలాగే గతేడాది పడిన కష్టాలు, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేసి, రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలు ప్రసాదించమని కోరుతూ ఈ మంటలు వేస్తారు. నూతన వెలుగులతో కొత్త జీవితాన్ని ప్రారంభించడమే ఈ భోగి మంటల అసలైన ఉద్దేశం.
News January 13, 2026
‘లైట్ ట్రాప్స్’తో సుడిదోమ, పచ్చదోమ కట్టడి

కొన్ని రకాల పురుగులు పంటలకు రాత్రి పూట కూడా హాని చేస్తుంటాయి. ఇలాంటి కీటకాలు రాత్రివేళ లైట్ కాంతికి బాగా ఆకర్షించబడతాయి. ఇలాంటి కీటకాలను ఆకర్షించి అంతంచేసేవే ‘లైట్ ట్రాప్స్’. ముఖ్యంగా వరిలో సుడిదోమ, పచ్చదోమ నివారణకు ఈ లైట్ ట్రాప్స్ బాగా పనిచేస్తాయి. లైట్‌తో పాటు ఒక టబ్‌లో నీటిని పోసి దానిలో రసాయన మందును కలిపితే పురుగులు లైట్‌కి ఆకర్షించబడి మందు కలిపిన నీళ్లలో పడి చనిపోతాయి.


