News August 14, 2024
MBNR:16 నుంచి శ్రావణమాస ఉత్సవాలు

తితిదే, హిందూ ధర్మప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో ఈనెల 16 నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శ్రావణమాస ఉత్సవాలు చేపట్టనున్నట్లు తితిదే కార్యక్రమ ఉమ్మడి జిల్లా అధికారి డా.ఉత్తరపల్లి రామాచారి వెల్లడించారు. ఈనెల 16న వరలక్ష్మి వ్రతాలు, 19న శ్రావణ పౌర్ణమి విశేష ప్రవచనాలు, 27న గోకులాష్టమి సందర్భంగా గోపూజ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఆయా జిల్లాలలో శ్రావణమాస ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Similar News
News January 19, 2026
మన్యంకొండ ఆలయ హుండీ ఆదాయం రూ.35.77 లక్షలు

మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.35,77,912 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు, గ్రంథాలయ ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
News January 19, 2026
మహబూబ్‌నగర్: టీచర్ల కాంప్లెక్స్ సమావేశాలు వాయిదా

రిపబ్లిక్ డే ఏర్పాట్ల నేపథ్యంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను వాయిదా వేయాలని డీఈఓ కార్యాలయ ఏడీ అనురాధకు టీఎస్‌యూటీఎఫ్ (TSUTF) నాయకులు వినతిపత్రం ఇచ్చారు. దీనికి సానుకూలంగా స్పందించిన అధికారులు, వేడుకల అనంతరం సమావేశాలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం పట్ల యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, వెంకటేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
News January 19, 2026
మహబూబ్‌నగర్: ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే ఉద్యోగాల కోసం ఇచ్చే ఐదు నెలల ఉచిత శిక్షణ కరపత్రాలను కలెక్టర్ విజయేందిర బోయి ఆవిష్కరించారు. డిగ్రీ అర్హత గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ఈ నెల 30లోగా https://www.tsstudycircle.co.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.


