News August 14, 2024

ఆసిఫాబాద్: అన్నదమ్ముల మధ్య గొడవ.. అన్న మృతి

image

అన్నదమ్ముల మధ్య గోడవలలో అన్న మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. సీఐ సతీశ్ కుమార్ ప్రకారం.. బురుగూడ గ్రామ సమీపంలో గల పైపుల కంపెనీలో బీహార్ కు చెందిన అన్నదమ్ములు సంజయ్, అజయ్ కూలీలుగా వచ్చారు. సోమవారం వారిద్దరి మధ్య గొడవ జరగగా అజయ్.. సంజయ్‌ని తలపై కొట్టడంతో బలమైన గాయమైంది. తోటి కూలీలు స్థానిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు సీఐ పేర్కొన్నారు.

Similar News

News January 24, 2026

ADB: మేడారం మహా జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

image

మేడారం మహా జాతరకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఉమ్మడి జిల్లాలోని ప్రధాన కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ భవాని ప్రసాద్ తెలిపారు. ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు డిపోల పరిధిలో జాతరకు 369 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 24, 2026

ఆదిలాబాద్ జైలు సూపరింటెండెంట్ బదిలీ

image

ఆదిలాబాద్ జిల్లా జైలు సూపరింటెండెంట్ అశోక్ నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు. 2021లో బాధ్యతలు చేపట్టిన ఆయన నాలుగున్నరేళ్ల పాటు పారదర్శక సేవలు అందించారు. జైలు ప్రాంగణంలో పెట్రోల్ బంక్, అడ్వాన్స్‌డ్ వెహికల్ వాష్, సోలార్ పార్కింగ్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆదిలాబాద్‌తో తనకున్న అనుబంధం మర్చిపోలేనిదని ఆయన పేర్కొన్నారు.

News January 24, 2026

ADB: నేటి నుంచి షో రూమ్‌లోనే బండి రిజిస్ట్రేషన్

image

నేటి నుంచి కొనుగోలు చేసే వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను డీలర్ పాయింట్ వద్దనే నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ ఉప రవాణా కమిషనర్ రవీందర్ కుమార్ పేర్కొన్నారు. ఈ కొత్త విధానం ద్వారా వ్యక్తిగత వాహన యజమానులుా కానీ, వాహనాలు గానీ రిజిస్ట్రేషన్ కోసం ఇకపై ఆర్టీఓ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు. వాహనం కొనుగోలు చేసిన డీలర్ షోరూమ్ నుంచే అవసరమైన అన్ని రిజిస్ట్రేషన్ ప్రక్రియలు పూర్తవుతాయన్నారు.