News August 14, 2024
పొలం చూసేందుకు వెళ్లి.. గుండెపోటుతో రైతు మృతి

పెనుబల్లి మండలం వీఎం బంజర్ సోమ్లానాయక్ తండాకు చెందిన రైతు తేజావత్ రాంబాబు (40) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఉదయం పొలం చూడటానికి వెళ్లి ఆకస్మికంగా కిందపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎస్ఐ వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 4, 2026
ఖమ్మం: దరఖాస్తుల ఆహ్వానం

రేవంత్ అన్న కా సహారా, ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మహ్మద్ ముజాహిద్ తెలిపారు. గతంలో ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, ఆ పత్రాలను సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాల్లో అందజేయాలని ఆయన సూచించారు.
News January 4, 2026
ఖమ్మం: ఏడాది గడిచినా అందని ‘ధాన్యం బోనస్’

ఖమ్మం జిల్లాలో ధాన్యం విక్రయించిన రైతులు బోనస్ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. గత యాసంగిలో క్వింటాకు రూ. 500 చొప్పున ప్రకటించిన బోనస్ ఇంతవరకు జమ కాలేదు. జిల్లావ్యాప్తంగా సుమారు రూ. 60 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని, ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
News January 4, 2026
ఖమ్మం: సీఎం కప్ క్రీడా పోటీలు.. దరఖాస్తుల ఆహ్వానం

ముఖ్యమంత్రి కప్ క్రీడా పోటీలకు అర్హులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం జిల్లా యువజన క్రీడల అధికారి సునీల్ రెడ్డి తెలిపారు. ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు రాణించడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 15వ తేదీలోపు అధికారిక వెబ్‌సైట్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.


