News August 14, 2024
మన పాలమూరు ప్రత్యేక చరిత్ర !

MBNRను గతంలో “రుక్మమాపేట”, “పాలమురు” అనేవారు. HYD (1869-1911AD) నిజాం మహబూబ్ అలీ ఖాన్ అసఫ్ జా VI గౌరవార్ధం ఈ పేరును 4 డిసెంబర్ 1890న మహబూబ్ నగర్ గా మార్చారు. ప్రసిద్ధ “కొహినార్” డైమండ్ తో సహా ప్రముఖ గోల్కొండ వజ్రాలు ఈ జిల్లా నుంచి వచ్చాయని టాక్. ఒకప్పుడు “చోళవాడి” / “చోళుల భూమి” అని పిలువబడింది. జిల్లాలో కృష్ణ, తుంగభద్ర నదులు ప్రవహిస్తాయి. రాష్ట్రంలోనే అత్యధిక గ్రామీణ జనాభా(89%) ఉన్న జిల్లా ఇది.
Similar News
News November 4, 2025
జానంపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మూసాపేట మండలం జానంపేటలో 28.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. చిన్నచింతకుంట 19.5, మిడ్జిల్ 11.3, కౌకుంట్ల 18.8, దేవరకద్ర 17.0, మహబూబ్‌నగర్ గ్రామీణ 9.8, అడ్డాకుల 8.5, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 5.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
News November 4, 2025
MBNR: U-14, 17 కరాటే.. నేడు ఎంపికలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్-14, 17 విభాగంలో కరాటే ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్సీఎఫ్ కార్యదర్శి Dr.ఆర్.శారదాబాయి Way2Newsతో తెలిపారు. నవంబర్ 4న మహబూబ్‌నగర్‌లోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్స్‌లో ఎంపికలు నిర్వహిస్తామని, అండర్-14 విభాగంలో 1.1.2012లో, అండర్-17 విభాగంలో 1.1.2009 తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులని, ఆసక్తిగల బాల, బాలికలు పీడీ నరసింహను (94928 94606) సంప్రదించాలన్నారు.
News November 3, 2025
MBNR: ఈనెల 7న దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ఈ నెల 7వ తేదీన మహబూబ్‌నగర్ అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.


