News August 14, 2024

హై అలర్ట్: ఢిల్లీ, పంజాబ్‌లో దాడులకు ఆస్కారం

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హై అలర్ట్‌లోకి వెళ్లాయి. కథువా సరిహద్దు గ్రామంలో ఆయుధాలతో ఇద్దరు ముష్కరుల కదలికలను పసిగట్టినట్టు వార్తలు వస్తున్నాయి. వారు పఠాన్‌కోట్‌ చేరుకోవడాన్ని కొట్టిపారేయలేమని, ఆగస్టు 15 లేదా 16, 17 తేదీల్లో ఢిల్లీ, పంజాబ్‌లో దాడులకు తెగబడొచ్చని ఏజెన్సీల అనుమానం. జూన్ 1నే పేలుడు పదార్థాలతో కూడిన ఓ కన్‌సైన్‌మెంట్ జమ్మూ నగరంలోకి రావడం గమనార్హం.

Similar News

News September 14, 2025

ఇవాళ మ్యాచ్ ఆడకపోతే..

image

బాయ్‌కాట్ <<17706244>>డిమాండ్<<>> నేపథ్యంలో ఆసియాకప్‌లో ఇవాళ PAKతో టీమ్ ఇండియా ఆడకపోతే తర్వాతి మ్యాచులో (Vs ఒమన్‌తో) తప్పక గెలవాలి. గ్రూపులోని మిగతా జట్ల ప్రదర్శన ఆధారంగా సూర్య సేన సూపర్-4కు చేరనుంది. అయితే పాక్ కూడా వచ్చి, భారత్ బాయ్‌కాట్ కొనసాగిస్తే మిగతా 2 మ్యాచులు గెలవాలి. ఒకవేళ భారత్, పాక్ ఫైనల్ చేరితే ఆ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తే టోర్నీ దాయాది సొంతం అవుతుంది. వేరే జట్టు ఫైనల్ వస్తే అమీతుమీ తేల్చుకోవాలి.

News September 14, 2025

బీజేపీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్సీ

image

AP: మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత BJPలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఏడాది క్రితం YCPకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సునీత ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. TDP ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆమె 2017లో MLCగా ఎన్నికయ్యారు. ఆ పార్టీకి రాజీనామా చేసి 2020లో వైసీపీలో చేరి మరోసారి ఎమ్మెల్సీ అయ్యారు. పరిటాల రవి ముఖ్య అనుచరుడు పోతుల సురేశ్ ఈమె భర్త.

News September 14, 2025

పాక్‌తో మ్యాచ్‌కు BCCI దూరం!

image

భారత్, పాక్ మ్యాచ్‌కు BCCI అధికారులు దూరం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. BCCI సెక్రటరీ సైకియా, IPL ఛైర్మన్ ధుమాల్, ట్రెజరర్ ప్రభ్‌తేజ్, జాయింట్ సెక్రటరీ రోహన్ దుబాయ్ వెళ్లేందుకు విముఖత చూపుతున్నట్లు సమాచారం. అటు ICC ఛైర్మన్ జైషా USలో ఉన్నారు. ACC ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్న BCCI సెక్రటరీ శుక్లా మాత్రమే మ్యాచ్ వీక్షించే అవకాశముంది. ఫ్యాన్స్ టార్గెట్ చేస్తారనే కెెమెరా ముందుకు రావట్లేదని తెలుస్తోంది.