News August 14, 2024

REWIND: సచిన్ తొలి సెంచరీ చేసిన రోజు

image

క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట 100 అంతర్జాతీయ సెంచరీలున్నాయి. ఎన్ని శతకాలున్నా తొలి సెంచరీ ఎప్పటికీ ప్రత్యేకమే. ఆ తొలి సెంచరీని ఆయన 1990, ఆగస్టు 14న ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన టెస్టులో చేశారు. సరిగ్గా 34 ఏళ్ల క్రితం జరిగిన ఆ మ్యాచ్‌లో 119 పరుగులతో అజేయంగా నిలిచి అప్పటికి టెస్టు సెంచరీ చేసిన రెండో అతి చిన్న ఆటగాడిగా(17 ఏళ్లు) చరిత్ర సృష్టించారు.

Similar News

News November 5, 2025

నవంబర్ 5: చరిత్రలో ఈరోజు

image

1877: సంస్కృతాంధ్ర పండితులు పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి జననం
1925: కవి, రచయిత ఆలూరి బైరాగి జననం
1987: మహాకవి దాశరథి కృష్ణమాచార్య మరణం (ఫొటోలో లెఫ్ట్)
1988: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ జననం (ఫొటోలో రైట్)
2019: నటుడు, దర్శకుడు కర్నాటి లక్ష్మీనరసయ్య మరణం
☛ ప్రపంచ సునామీ దినోత్సవం

News November 5, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 5, 2025

WTM-2025లో పాల్గొన్న మంత్రి దుర్గేశ్

image

లండన్‌లో జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్(WTM)-2025 సమావేశంలో AP పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన స్టాల్‌, AP పర్యాటక స్టాల్‌ను వివిధ రాష్ట్రాల పర్యాటక మంత్రులతో కలిసి ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రతినిధులతో రాష్ట్రంలో పర్యాటక పెట్టుబడుల అవకాశాలు, టూరిజం ప్యాకేజీల గురించి వివరించారు. AP పర్యాటకానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.