News August 14, 2024

గనుల రాష్ట్రాలకు ఘన విజయం.. రాయల్టీ వసూలుకు సుప్రీం అనుమతి

image

మైనింగ్ కంపెనీల నుంచి రాయల్టీ బకాయిలను రాష్ట్రాలు వసూలు చేసుకోవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 2005 ఏప్రిల్ 1 తర్వాత బకాయిలను 12 ఏళ్ల వ్యవధిలో వసూలు చేసుకోవాలని, చెల్లింపులపై జరిమానాలు విధించొద్దని ఆదేశించింది. PSUలపై రూ.70వేల కోట్లు, ప్రజలపై భారం పడుతుందని దీనిని కేంద్రం వ్యతిరేకిస్తోంది. గనుల భూమిపై రాయల్టీ అధికారం రాష్ట్రాలదేనని జులై 25న సుప్రీం కోర్టు 8:1 తేడాతో తీర్పునిచ్చింది.

Similar News

News February 8, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 పెరిగి రూ.79,450లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 పెరగడంతో రూ.86,670 పలుకుతోంది. కాగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

News February 8, 2025

ఢిల్లీ ఫలితాలపై పవన్ ఏమన్నారంటే?

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ప్రధాని మోదీపై ప్రజలకు ఉన్న విశ్వాసం మరోసారి రుజువైందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా మోదీ పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకమన్నారు. అమిత్ షా రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలు ఇచ్చాయని పేర్కొన్నారు.

News February 8, 2025

0..0..0: ఢిల్లీలో కాంగ్రెస్ హ్యాట్రిక్ డకౌట్

image

దేశ రాజధాని ఢిల్లీ ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కనీసం 40% ఓటుషేర్ సంపాదించేది. మాజీ CM షీలాదీక్షిత్ నాయకత్వంలో వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న పార్టీ. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వరుసగా మూడో సారీ ఖాతా తెరవకుండా హ్యాట్రిక్ డకౌట్ రికార్డు ఖాతాలో వేసుకుంది. క్రితంసారి 3% ఓటుషేర్ సాధించిన హస్తం పార్టీ ఈసారి 7 శాతంతో ఆనందపడాల్సి వస్తోంది. ఆ పార్టీ దుస్థితిపై మీ కామెంట్.

error: Content is protected !!