News August 14, 2024
ఎలాన్ మస్క్, జేకే రౌలింగ్‌పైనా ఖెలీఫ్ కేసు
అల్జీరియా వివాదాస్పద బాక్సర్ ఖెలీఫ్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన సంగతి తెలిసిందే. అనంతరం తనను నెట్టింట విమర్శించిన వారందరిపై ఆమె ఫ్రాన్స్‌లో దావా వేశారు. వారిలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ‘హ్యారీపోటర్’ రచయిత్రి జేకే రౌలింగ్ కూడా ఉన్నారు. ఇటలీ బాక్సర్ ఓడిపోయిన సమయంలో ఖెలీఫ్‌ను విమర్శిస్తూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు మస్క్ మద్దతునిచ్చారు. అటు రౌలింగ్ సైతం ఖెలీఫ్ మగాడంటూ ట్వీట్ వేశారు.
Similar News
News February 8, 2025
ఢిల్లీ ఫలితాలపై పవన్ ఏమన్నారంటే?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ప్రధాని మోదీపై ప్రజలకు ఉన్న విశ్వాసం మరోసారి రుజువైందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా మోదీ పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకమన్నారు. అమిత్ షా రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలు ఇచ్చాయని పేర్కొన్నారు.
News February 8, 2025
0..0..0: ఢిల్లీలో కాంగ్రెస్ హ్యాట్రిక్ డకౌట్
దేశ రాజధాని ఢిల్లీ ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కనీసం 40% ఓటుషేర్ సంపాదించేది. మాజీ CM షీలాదీక్షిత్ నాయకత్వంలో వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న పార్టీ. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వరుసగా మూడో సారీ ఖాతా తెరవకుండా హ్యాట్రిక్ డకౌట్ రికార్డు ఖాతాలో వేసుకుంది. క్రితంసారి 3% ఓటుషేర్ సాధించిన హస్తం పార్టీ ఈసారి 7 శాతంతో ఆనందపడాల్సి వస్తోంది. ఆ పార్టీ దుస్థితిపై మీ కామెంట్.
News February 8, 2025
బీజేపీ ఘన విజయం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ 36 స్థానాల మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. మరో 11 చోట్ల లీడింగ్‌లో కొనసాగుతోంది. దీంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగిరింది. అటు ఆప్ 19 స్థానాల్లో గెలిచి 4 చోట్ల ఆధిక్యంలో ఉంది.