News August 14, 2024
సాలూరు: అన్న క్యాంటీన్‌కు మంత్రి విరాళం

సాలూరులోని అన్న క్యాంటీన్‌లో భోజనం అందించేందుకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. బుధవారం సాలూరు తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో అన్న క్యాంటీన్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.60 లక్షల అంచనా వ్యయంతో భవనాన్ని నిర్మిస్తున్నారు. పేదలు ఆకలితో అలమటించకూడదనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News December 27, 2025
మహిళల రక్షణకు 30 మందితో 5 శక్తి టీమ్స్: VZM SP

మహిళల రక్షణ కోసం జిల్లాలో 30 మందితో ఐదు ‘శక్తి టీమ్స్’ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒక్కో బృందానికి ఎస్ఐ నాయకత్వం వహిస్తారని, మఫ్టీలో విధులు నిర్వహిస్తూ వేధింపులపై తక్షణ చర్యలు తీసుకుంటారన్నారు. శక్తి యాప్‌పై అవగాహన, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, పోక్సో చట్టాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.

News December 26, 2025
పిల్లలే దేశ భవిష్యత్‌కు పునాది: VZM కలెక్టర్

వీర్ బాల్ దివస్ వేడుకలు విజయనగరం జిల్లాలో శుక్రవారం ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణితో కలిసి జాతీయ స్థాయి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా వీర్ బాల్ దివస్‌కు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. పిల్లలే దేశ భవిష్యత్తుకు పునాది అని కలెక్టర్ పేర్కొన్నారు.