News August 14, 2024
Stock Market: కొంత లాభాలు
దేశీయ సూచీల్లో సెన్సెక్స్ కొంత లాభాలతో గట్టెక్కగా, నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిసింది. బుధవారం ఉదయం కొంత గ్యాప్ అప్‌తో నిఫ్టీలో ట్రేడింగ్ ప్రారంభమవ్వగా రోజంతా కన్సాలిడేషన్ జరిగింది. చివరికి ఐదు పాయింట్ల లాభంతో 24,143 వద్ద నిలిచింది. అటు సెన్సెక్స్ 150 పాయింట్లు బలపడి 79,105 వద్ద ముగిసింది. ఈ రోజు ఐటీ కంపెనీలు భారీగా లాభపడ్డాయి.
Similar News
News January 21, 2025
మరో వారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు
TG: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. మరో వారంపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గద్వాల జిల్లా మినహా అన్ని జిల్లాల్లో టెంపరేచర్ 15°C కంటే తక్కువగా నమోదవుతుండటంతో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News January 21, 2025
ఎంపీల కారు అలవెన్సుగా నెలకు రూ.లక్ష
AP: రాష్ట్రానికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల కార్లకు అలవెన్సుల కింద నెలకు రూ.లక్ష చొప్పున మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మంత్రులకు మినహా మిగతా ఎంపీలకు ఈ అలవెన్స్ వర్తించనుంది. అలాగే డిప్యూటీ స్పీకర్, ఆర్థిక మంత్రి, ప్రభుత్వ చీఫ్ విప్‌కు గృహోపకరణాల కొనుగోలుకు ఒకసారి గ్రాంటుగా రూ.1.50లక్షల చొప్పున రూ.4.50 లక్షలు మంజూరు చేస్తూ మరో ఉత్తర్వును సర్కారు జారీ చేసింది.
News January 21, 2025
కుంభమేళాలో 12లక్షల తాత్కాలిక ఉద్యోగాలు!
ప్రయాగ్‌రాజ్ మహాకుంభ మేళాలో 12లక్షల తాత్కాలిక ఉద్యోగాల సృష్టి జరిగిందని గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ NLB సర్వీసెస్ అంచనా వేసింది. పర్యాటక, ఆతిథ్య రంగాల్లోనే సుమారు 4.5లక్షల మందికి ఉపాధి లభించవచ్చని తెలిపింది. హోటల్ స్టాఫ్, టూర్ గైడ్, పోర్టర్లు, ట్రావెల్ కన్సల్టెంట్లు, ఈవెంట్ కోఆర్డినేటర్లు, రవాణా, వైద్య శిబిరాల్లో లక్షల మందికి పని దొరికిందని చెప్పింది.