News August 14, 2024
BSNL 4G వచ్చేసింది!

పెరిగిన టారిఫ్ ధరలతో సతమతమవుతున్న టెలికం యూజర్లకు BSNL అదిరిపోయే న్యూస్ చెప్పింది. మొబైల్‌లో BSNL సిమ్‌కు 4G నెట్‌వర్క్ వచ్చినట్లు తెలియజేస్తూ ఓ ఫొటోను టెలికమ్యూనికేషన్స్ శాఖ ట్వీట్ చేసింది. అతి త్వరలోనే దగ్గరలోని ఔట్‌లెట్లలో వినియోగదారులు 4G సిమ్ పొందొచ్చని తెలిపింది. ప్రస్తుతం టవర్స్ ఏర్పాటు చేసే ప్రక్రియ జరుగుతున్నందున మొదట కొన్ని చోట్ల 4G నెట్‌వర్క్ వచ్చే అవకాశం ఉంది.
Similar News
News November 15, 2025
తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్

తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా అంతరాయం కలిగింది. ఈ సమయంలోనే న్యాయస్థానం వెబ్సైట్లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షం కావడంతో సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు హ్యాకర్ల గురించి దర్యాప్తు చేపట్టారు.
News November 15, 2025
రూ.1,201 కోట్ల పెట్టుబడి.. రేమండ్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన

AP: సీఐఐ వేదికగా రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. రూ.1,201 కోట్ల మూడు ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు రేమండ్ సంస్థ ప్రకటించింది. ఈమేరకు వాటికి సీఎం చంద్రబాబు, సంస్థ ఎండీ గౌతమ్ మైనీ శంకుస్థాపన చేశారు. దేశ ఏరోస్పేస్, రక్షణ అవసరాలను తీర్చేలా రేమండ్ పరికరాలు తయారుచేయడం అభినందనీయమని CBN అన్నారు.
News November 15, 2025
యాపిల్‌కు త్వరలో కొత్త CEO.. టిమ్ కుక్ వారసుడు ఎవరు?

2011లో స్టీవ్ జాబ్స్ నుంచి టిమ్ కుక్ యాపిల్ CEOగా బాధ్యతలు అందుకున్నారు. కంపెనీని 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లిన కుక్.. 2026 ప్రారంభంలో తన వారసుడిని ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. 2001లో హార్డ్‌వేర్ ఆర్కిటెక్ట్‌గా ప్రొడక్ట్ డిజైన్ టీమ్‌లో చేరిన జాన్ టెర్నస్ తదుపరి సీఈవోగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని టాక్. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్టులో పేర్కొంది.


