News August 14, 2024

బీసీసీఐ-బైజూ సెటిల్‌మెంట్‌పై సుప్రీం కోర్టు స్టే

image

బైజూస్‌కు, బీసీసీఐకి మధ్య రూ.158.9 కోట్లకు సెటిల్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. సెటిల్‌మెంట్‌ను జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్(NCLAT) ఆమోదించడాన్ని సవాలు చేస్తూ అమెరికాకు చెందిన గ్లాస్ ట్రస్ట్ కంపెనీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం NCLAT నిర్ణయంపై సుప్రీం కోర్టు స్టే విధించింది. తదుపరి నోటీసులిచ్చేవరకూ సెటిల్‌మెంట్ డబ్బును బ్యాంకు ప్రత్యేక ఖాతాలో ఉంచాలని స్పష్టం చేసింది.

Similar News

News January 26, 2026

కడప: ఇన్‌స్టాతో పరిచయం.. లాడ్జిలో యువతిపై అత్యాచారం

image

తిరుపతిలో దారుణం వెలుగుచూసింది. అలిపిరి CI రామ్ కిశోర్ వివరాల మేరకు.. కడప(D) బద్వేల్‌కు చెందిన యశ్వంత్ చిత్తూరులో బీటెక్ చదువుతున్నాడు. ఇన్‌స్టా ద్వారా తిరుపతి గ్రామీణ మండలానికి చెందిన అమ్మాయి పరిచయమైంది. ఆమెను మాయమాటలతో హోమ్‌స్టేకు పిలిపించిన విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరించి నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు CI తెలిపారు.

News January 26, 2026

కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

image

<>కొచ్చిన్<<>> పోర్ట్ అథారిటీ 7 మెరైన్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు FEB 23 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ(ఎకనామిక్స్/ స్టాటిస్టిక్స్/మ్యాథ్స్), బీటెక్(మెరైన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 35-40ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://www.cochinport.gov.in

News January 26, 2026

ఇంటింటికీ ‘Prestige’.. ఫౌండర్‌కు పద్మశ్రీ

image

వంటింట్లో ఉండే వస్తువుల్లో ప్రెషర్ కుక్కర్ ఒకటి. అలాంటి ప్రెషర్ కుక్కర్‌ను మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత టీటీకే ప్రెస్టీజ్‌ గ్రూప్ అధినేత జగన్నాథానికి దక్కుతుంది. పారిశ్రామిక రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం మరణానంతరం పద్మశ్రీతో గౌరవించింది. ప్రెషర్ కుక్కర్స్‌లో సేఫ్టీ మెకానిజాన్ని ఆవిష్కరించిన ఆయన ప్రెస్టీజ్‌కు బ్రాండ్‌ను క్రియేట్ చేసి ‘కిచెన్ మొఘల్’ అయ్యారు.