News August 14, 2024
ఉనికిని కాపాడుకునేందుకు TDP నేతలపై దాడులు: మంత్రి బీసీ

కర్నూలు (D) పత్తికొండ (మం) హోసూరులో TDP నేత శ్రీను హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. YCP ఉనికిని కాపాడుకునేందుకు జగన్&కో తమ నేతలు, కార్యకర్తలపై హత్యలు, బెదిరింపులతో దాడులకు పాల్పడుతుందని బీసీ విమర్శించారు. హత్య చేసిన వారిని, వారి వెనుకున్న వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభుత్వం తరఫున శ్రీను కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి బీసీ హామీచ్చారు.
Similar News
News March 20, 2026
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలి: మంత్రి

ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉందని మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం కర్నూలు నగరంలోని ఆయన కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
News March 20, 2026
నగరాభివృద్ధికి ప్రత్యేక దృష్టి: కలెక్టర్

కర్నూలు నగరాభివృద్ధిని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానని కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. శుక్రవారం వెంకటరమణ కాలనీలోని నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఆమె తన ఛాంబర్‌ను ప్రారంభించారు. కమిషనర్ పి.విశ్వనాథ్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నగర పరిపాలనలో సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం తన కార్యాలయంలో కేఎంసి పూర్తి మ్యాప్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.
News March 20, 2026
రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ప్రభుత్వ పథకాల పేరుతో వస్తున్న నకిలీ కాల్స్, లింక్స్‌పై రైతులు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ హెచ్చరించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధుల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
తెలియని వ్యక్తులకు ఓటీపీ, బ్యాంక్ వివరాలు చెప్పొద్దని, అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేయవద్దని సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని తెలిపారు.


