News August 14, 2024

టీఎంసీని టార్గెట్ చేసిన బీజేపీ

image

బెంగాల్‌లో ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచారం ఘ‌ట‌నపై అధికార టీఎంసీని విప‌క్ష‌ బీజేపీ టార్గెట్ చేసింది. ఈ కేసులో బెంగాల్ ప్ర‌భుత్వం నిజాలను దాస్తోందని ఆరోపించింది. కేసు విచార‌ణ జ‌రుగుతుండ‌గానే ఆర్జీ కర్ మెడిక‌ల్ కాలేజీ ప్రిన్సిపల్ డా. సందీప్ ఘోష్‌ను మ‌రో కాలేజీకి ప్రిన్సిప‌ల్‌గా నియ‌మించ‌డాన్ని త‌ప్పుబ‌డుతోంది. ఆధారాల‌ను క‌ప్పిపుచ్చి ప‌లుకుబ‌డి క‌లిగిన‌వారిని TMC ర‌క్షిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.

Similar News

News October 30, 2025

చైనా అంతరిక్ష యాత్రకు పాక్ ఆస్ట్రోనాట్‌!

image

చైనా, పాకిస్థాన్ దోస్తీ కొత్త పుంతలు తొక్కుతోంది. తమ టియాంగోంగ్ స్పేస్ స్టేషన్‌కు చేపట్టే స్వల్పకాలిక అంతరిక్ష యాత్రలో పాకిస్థానీ ఆస్ట్రోనాట్‌కు అవకాశం కల్పిస్తామని చైనా ప్రకటించింది. ఎంపికైన పాక్ వ్యోమగామికి తమ ఆస్ట్రోనాట్లతో పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ట్రైనింగ్ ప్రోగ్రామ్, మిషన్ టైమ్‌లైన్‌ను ఖరారు చేసే పనిలో చైనా, పాక్ స్పేస్ ఏజెన్సీలు ఉన్నాయని అక్కడి మీడియా వెల్లడించింది.

News October 30, 2025

సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్

image

సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్‌ <<18087163>>సూర్యకాంత్‌<<>>ను నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత CJI గవాయ్ చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. 53వ సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ నవంబర్‌ 24న బాధ్యతలు స్వీకరించనున్నారు. 2027 ఫిబ్రవరి వరకు కొనసాగుతారు. హరియాణా నుంచి ఎన్నికైన తొలి సీజేఐగా సూర్యకాంత్ నిలవనున్నారు.

News October 30, 2025

దేశ ద్రోహానికి పాల్పడ్డ వ్యక్తి అజహరుద్దీన్: కిషన్ రెడ్డి

image

TG: అజహరుద్దీన్‌కు మంత్రి పదవిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశ ద్రోహానికి పాల్పడ్డ వ్యక్తి అజహరుద్దీన్. దేశానికి చెడ్డ పేరు తెచ్చారు. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారు’ అని వ్యాఖ్యానించారు. అటు జూబ్లీహిల్స్‌లో MIM ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ అభ్యర్థే జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.