News August 14, 2024
అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.కోటి విరాళం

AP: అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.కోటి విరాళం ఇచ్చారు. ‘అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్‌లో ఆకలి అనే పదం వినబడకూడదనే మహోన్నత లక్ష్యంతో చంద్రబాబు అన్న క్యాంటీన్లను పునఃప్రారంభిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజే అన్న క్యాంటీన్లు స్టార్ట్ అవుతుండటం శుభపరిణామం. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరఫున రూ.కోటి ఇచ్చాను. నిరుపేదల ఆకలి తీర్చే కార్యక్రమంలో మీరూ భాగస్వాములు అవ్వండి’ అని ఆమె ట్వీట్ చేశారు.
Similar News
News November 5, 2025
IIM షిల్లాంగ్‌లో ఉద్యోగాలు

<
News November 5, 2025
BSNL ఫైబర్.. బేసిక్ ప్లాన్ కేవలం రూ.399!

సరసమైన రీఛార్జ్ ప్యాక్స్‌తో యూజర్లను ఇంప్రెస్ చేస్తోన్న ప్రభుత్వ రంగ సంస్థ BSNL ఇప్పుడు అతి తక్కువ ధరకే ఫైబర్ బేసిక్ ప్లాన్‌ను అందిస్తోంది. BSNL తమ ఫైబర్ బేసిక్ ప్లాన్‌ను కేవలం ₹399గా నిర్ణయించింది. దీంతో 60 Mbps వేగంతో నెలకు 3300 GB డేటాను పొందగలరు. ఆ తర్వాత 4Mbps వేగంతో డేటా లభిస్తుందని సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో మొదటి నెల ఉచితం కాగా.. తొలి 3 నెలలు ప్లాన్‌పై అదనంగా ₹100 తగ్గింపు ఉంటుంది.
News November 5, 2025
బంధంలో బ్యాలెన్స్ ముఖ్యం

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతో అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్నట్లవుతుంది. సున్నితమైన విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మీ జీవితం మీకు తెలీకుండానే చేజారే అవకాశం ఉంది. బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్‌డ్‌గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.


