News August 14, 2024
SBI, PNBలకు కర్ణాటక సర్కార్ షాక్
కర్ణాటకలో సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. SBI, PNB(పంజాబ్ నేషనల్ బ్యాంక్)లతో అన్ని రకాల లావాదేవీలను సస్పెండ్ చేసింది. ఆయా బ్యాంకుల్లో ఉన్న ప్రభుత్వ అకౌంట్లను వెంటనే మూసివేయాలని అన్ని శాఖలకు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఆదేశాలిచ్చింది. ఆ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నిధులు దుర్వినియోగానికి గురవుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News January 20, 2025
Paytm Q3 Results: తగ్గిన నష్టం, పడిపోయిన ఆదాయం
Q3లో ఫిన్‌టెక్ మేజర్ Paytm నికర నష్టం రూ.219 కోట్ల నుంచి రూ.208 కోట్లకు తగ్గింది. ఆదాయంలో మాత్రం 36% మేర కోతపడింది. గత ఏడాది ఇదే సమయంలోని రూ.2,851 కోట్ల నుంచి రూ.1,828 కోట్లకు పడిపోయింది. GMV, చందాదారుల పెరుగుదలతో QoQ పద్ధతిన రెవెన్యూ 10% ఎగిసింది. నగదు రూ.2,851 కోట్లు పెరిగి రూ.12,850 కోట్లుగా ఉంది. PAYPAYలో వాటా విక్రయమే ఇందుకు కారణం. నేడు ఈ షేర్లు 1.35% ఎగిసి రూ.912 వద్ద ట్రేడవుతున్నాయి.
News January 20, 2025
జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణ ధర్మాసనం మార్పు
AP: వైఎస్ జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మరోసారి మార్చింది. గతంలో జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం ఈ కేసులను విచారించగా, 12 ఏళ్లుగా ట్రయల్ అడుగు కూడా ముందుకు కదలలేదని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తరఫు న్యాయవాది వాదించారు. దీంతో జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనానికి ట్రయల్‌ను మార్చింది.
News January 20, 2025
దమ్ముంటే ఐదేళ్ల వైసీపీ పాలనపై విచారణ జరిపించండి: షర్మిల
AP: గత 5ఏళ్ల పాలన ఓ విపత్తు అని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. ‘ఆ ఐదేళ్లు కేంద్రంలో ఉంది మీరే కదా? భారీ స్థాయిలో అవినీతి జరిగితే ఎందుకు బయటపెట్టలేదు? రాజధాని లేకుండా పాలన సాగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? జగన్ మీరు ఆడించినట్లు ఆడినందుకా? మీకు దమ్ముంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించండి’ అని అమిత్ షాను డిమాండ్ చేశారు.