News August 14, 2024
అవసరమైతే నన్ను తిట్టండి: మమతా బెనర్జీ

కోల్‌కతాలో డాక్టర్‌పై హత్యాచార ఘటనలో అన్ని చర్యలు తీసుకున్నా తమపై దుష్ప్రచారం జరుగుతోందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. అవసరమైతే తనను తిట్టొచ్చని, కానీ బెంగాల్‌ని దూషించొద్దని కోరారు. కేసు త్వరగా పరిష్కారమయ్యేందుకు సీబీఐకి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ, సీపీఐ బంగ్లాదేశ్ తరహాలో నిరసనలకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు.
Similar News
News July 5, 2025
ప్రపంచ టెస్టు క్రికెట్‌లో 10,000వ డకౌట్

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఇంగ్లండ్ ఆటగాడు కార్స్ డకౌట్ ప్రపంచ టెస్టు క్రికెట్‌లో 10,000వ డకౌట్‌గా నిలిచింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఆయన LBWగా వెనుదిరిగారు. 1877లో ఎడ్వర్డ్ గ్రెగరీ తొలిసారి డకౌట్ అయిన ప్లేయర్‌గా ఉన్నారు. 10,000 డకౌట్లు కావడానికి దాదాపు శతాబ్దంన్నర పట్టింది. కాగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఆరుగురు ప్లేయర్లు డకౌట్ కావడం విశేషం.
News July 5, 2025
సూపర్‌యునైటెడ్ ర్యాపిడ్ టైటిల్ నెగ్గిన గుకేశ్

గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా క్రోయేషియాలో జరుగుతున్న సూపర్‌యునైటెడ్ ర్యాపిడ్&బ్లిట్జ్ టోర్నీలో వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ ర్యాపిడ్ టైటిల్ నెగ్గారు. ఫైనల్ రౌండ్లో USకు చెందిన వెస్లేపై విజయం సాధించారు. నిన్న ఐదో రౌండ్లో వరల్డ్ No.1 కార్ల్‌సన్‌ను ఓడించిన విషయం తెలిసిందే. కాగా ఇవాళ్టి నుంచి బ్లిట్జ్ ఫార్మాట్ మొదలవనుంది. ర్యాపిడ్, బ్లిట్జ్ 2 ఫార్మాట్లలో ప్రదర్శన ఆధారంగా ఓవరాల్ విన్నర్‌ను ప్రకటిస్తారు.
News July 5, 2025
డీఎస్సీ నియామక ఉత్తర్వులపై ఆదేశాలు

AP: ఆగస్టు నాటికి డీఎస్సీ నియామక ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, ఉన్నత విద్యాశాఖల ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో ఆయన సమీక్షించారు. డిగ్రీ విద్యార్థులపై భారం తగ్గేలా UGC నిబంధనలకు అనుగుణంగా సబ్జెక్టుల ఎంపిక ఉండేలా చూడాలని సూచించారు. 2024-25కి సంబంధించి ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.