News August 14, 2024

సౌదీ రాజు సాయంతో 500KGలకు పైగా బరువు తగ్గాడు!

image

ప్రపంచంలోనే అత్యధిక బరువున్న వ్యక్తిగా పేరొందిన సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్ ఏకంగా 500 కేజీలకు పైగా బరువు తగ్గాడు. 2013లో ఖలీద్ 610KGల బరువుతో మంచానికే పరిమితమై ఉండేవాడు. అతడు బరువు తగ్గేందుకు అప్పటి సౌదీ రాజు అబ్దుల్లా 30 మంది వైద్యులతో మెడికల్ టీమ్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక డైట్‌తో పలు సర్జరీలు చేయగా ఇప్పుడు 63.5 కేజీలకు తగ్గాడు. సన్నగా మారిన అతడికి సిబ్బంది ‘స్మైలింగ్ మ్యాన్’ అని పేరు పెట్టారు.

Similar News

News January 12, 2026

మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత

image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి(86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ అమీర్‌పేటలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు రాజకీయ నాయకులు ఆమె నివాసానికి వెళ్లి నివాళి అర్పిస్తున్నారు. కాగా రోశయ్య 2021లో మరణించారు. ఆయన 2009-10 మధ్య ఏపీ సీఎంగా పనిచేశారు. 2011-16 మధ్య తమిళనాడు గవర్నర్‌గా సేవలందించారు.

News January 12, 2026

‘మన శంకరవరప్రసాద్ గారు’ రివ్యూ & రేటింగ్

image

విడిపోయిన భార్యాభర్తలు తిరిగి ఎలా కలిశారనేది MSVPG స్టోరీ. మెగాస్టార్ ఎంట్రీ, కామెడీ టైమింగ్, డాన్స్ స్పెషల్ అట్రాక్షన్. నయనతార, ఇతర నటుల పాత్రలు, వారి నటన బాగున్నాయి. సెకండాఫ్‌లో వెంకీ ఎంట్రీ తర్వాత మూవీ మరో స్థాయికి వెళ్తుంది. చిరు-వెంకీ కాంబో సీన్స్ ఆకట్టుకుంటాయి. అనిల్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. రెగ్యులర్ స్టోరీ, ముందే ఊహించగల కొన్ని సీన్లు మైనస్.
రేటింగ్: 3/5

News January 12, 2026

చేనేత సహకార సంఘాలకు రూ.5 కోట్లు

image

AP: చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. DECలో ఆప్కో బకాయిల్లో రూ.2.42 కోట్లు చెల్లించారు. సంక్రాంతి సందర్భంగా మరో రూ.5 కోట్ల బకాయిలు చెల్లించాలని మంత్రి సవిత ఆప్కో యాజమాన్యాన్ని ఆదేశించారు. చేనేత ఉత్పత్తుల విక్రయాల కోసం కో ఆప్టెక్స్, టాటా తనేరియా, ఆద్యం బిర్లా గ్రూప్‌తో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జియోమార్ట్ ద్వారా కూడా అమ్మకాలు ప్రారంభించామన్నారు.