News August 14, 2024

దోషిని ఉరి తీయాలి: CM మ‌మ‌తా బెనర్జీ

image

ట్రైనీ డాక్ట‌ర్‌పై హ‌త్యాచారం కేసులో దోషిని ఉరితీయాల‌ని బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ డిమాండ్ చేశారు. అవసరమైతే దీని కోసం ర్యాలీ తీస్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో కోల్‌క‌తా పోలీసుల వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌ని, వాటిని సీబీఐకి స‌మ‌ర్పించిన‌ట్టు తెలిపారు. ‘ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని ఉరితీయడమే మాకు కావాలి. వచ్చే ఆదివారం వరకు సీబీఐ న్యాయం చేస్తుందని ఆశిస్తున్నా’ అని ఆమె అన్నారు.

Similar News

News February 22, 2026

ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

image

శుభకార్యాల సీజన్‌కు తోడు ఇవాళ ఆదివారం సెలవు కావడంతో చాలామంది బంగారం, వెండి కొనుగోళ్లకు వెళ్తుంటారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ రూ.1,59,280గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.1,46,000 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ రేట్ రూ.2,90,000గా కొనసాగుతోంది. ఇటీవల భారీగా పెరిగిన ఈ రెండు మెటల్ రేట్స్ కాస్త తగ్గి కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి.

News February 22, 2026

బండిపై ప్రయాణిస్తున్నారా..ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

ఈ బిజీ ప్రపంచంలో మహిళలు రోజూ ప్రయాణాలు చేయడం, వాహనాలు నడపడం తప్పనిసరైంది. అయితే ఈ సమయంలో ప్రమాదాలు నివారించడానికి కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. బండి నడిపేటపుడు చీర కొంగు, చున్నీ ఎగరకుండా బిగించి కట్టుకోవాలి. లేదంటే చక్రాలకు శారీగార్డు ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలతో ప్రయాణించేటపుడు టూ వీలర్​ బేబీ బెల్ట్​, ఛైల్డ్‌ క్యారియర్‌ వంటివి వాడటం వల్ల ప్రమాదాల తీవ్రత తగ్గుతుంది.

News February 22, 2026

BREAKING: లొంగిపోయిన దేవ్‌జీ

image

ఆపరేషన్ కగార్‌లో కీలక పరిణామం. మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్ దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి <<19197693>>సరెండర్<<>> అయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16మందితో కలిసి ఆయన తెలంగాణ SIB ముందు లొంగిపోయారు. మార్చి 31నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామన్న కేంద్రం.. దేవ్‌జీ, రాజిరెడ్డి టార్గెట్‌గా ఇటీవల ఆపరేషన్ కగార్-2 చేపట్టింది. ఈక్రమంలోనే వారిద్దరూ లొంగిపోయారు. 2 రోజుల్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.