News August 14, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ వేములవాడ ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
@ జగిత్యాల కలెక్టర్‌తో ఎంపీ ధర్మపురి అరవింద్ భేటీ
@ ముస్తాబాద్ మండలంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
@ సిరిసిల్లలో ఇంట్లో దూరిన నెమలి.. పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు
@ మెట్పల్లిలో బాలుడి కిడ్నాప్ కు పాల్పడిన పడిన వ్యక్తి అరెస్ట్
@ స్వాతంత్ర దినోత్సవానికి ముస్తాబైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లు

Similar News

News July 7, 2025

‘కాలేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదు’

image

కాలేశ్వరం ప్రాజెక్టుపై BRS నేతలకు మాట్లాడే నైతికహక్కు లేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, MLC కోదండరాం అన్నారు. శంకరపట్నం మండలంలోని మొలంగూర్‌లో జరిగిన ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ఆయన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పర్యాటక అభివృద్ధి గురించి చర్చించారు. ఇందుకు కృషి చేస్తామని తెలిపారు. BRS ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం యువనాయకులు పనిచేయాలన్నారు.

News July 7, 2025

కరీంనగర్ జిల్లాలో 59 మంది ఎంపిక

image

బాసర-IIIT ప్రవేశాల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 293 మంది విద్యార్థులు తాత్కాలికంగా ఎంపికయ్యారు. ఇందులో సిరిసిల్ల జిల్లా నుంచి అత్యధికంగా -117 మంది ఉన్నారు. జగిత్యాల జిల్లా -66 మంది, కరీంనగర్ జిల్లా – 59 మంది, పెద్దపల్లి జిల్లా – 51 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు నేటి నుంచి 9వ తేదీ వరకు బాసర-IIIT లో కౌన్సెలింగ్ జరుగుతుంది.

News July 7, 2025

పోరండ్లలో నకిలీ వైద్యుడి క్లినిక్.. గుర్తించిన టీజీ ఎంసీ బృందాలు

image

తిమ్మాపూర్ మండలం పోరండ్లలో అర్హత లేకుండా డాక్టర్‌గా చలామణి అవుతూ అనుమతి, ఏ రకమైన బోర్డు లేకుండా నిర్వహిస్తున్న అల్లోపతి క్లినిక్‌ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందాలు గుర్తించాయి. నకిలీ వైద్యుల క్లినిక్‌లపై తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో పోరండ్లలో రవీందర్ రెడ్డి అనే నకిలీ వైద్యుడు రోగులకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్‌లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్‌లు, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్‌లు ఇస్తున్నట్లు గుర్తించారు.