News August 14, 2024

మహానుభావులను స్మరించుకోవాలి: పవన్

image

మన దేశం స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు పొందటానికి జీవితాలు, ప్రాణాలు ధారపోసిన మహానుబావులందరినీ స్మరించుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ భారతీయులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తిరంగా వేడుకలు గ్రామగ్రామాన ఒక పండుగ వాతావరణంలో చేసుకునేందుకు పంచాయతీలకు జెండా పండుగకు అవసరమైన నిధులు పెంచుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు.

Similar News

News September 17, 2025

శాసన సభ స్పీకర్‌ను కలిసిన గుంటూరు ఎస్పీ

image

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వకుల్ జిందాల్ బుధవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడంతోపాటు పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని స్పీకర్ సూచించారు. జిల్లా శాంతిభద్రతల పరిరక్షణలో, నేరాల నిర్మూలనలో కఠిన చర్యలు తీసుకొని ప్రజా భద్రతను కాపాడాలని స్పష్టం చేశారు.

News September 17, 2025

వెలగపూడి: బీసీ రక్షణ చట్టంపై మంత్రి అనగాని సమీక్ష

image

బీసీల రక్షణ కోసం చట్టం రూపొందించడంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ బుధవారం వెలగపూడి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర బీసీ రక్షణ చట్టం తీసుకురావడానికి కసరత్తు జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ చట్టం అమలులో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కారాలపై సహచర మంత్రులతో ఆయన చర్చించారు. బీసీల హక్కుల రక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

News September 17, 2025

రేపు వెంకటపాలెంలో NTR విగ్రహానికి నివాళులర్పించనున్న సీఎం

image

రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెంకటపాలెంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. ఉదయం 8 గంటలకు పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పిస్తారని తాడికొండ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం తెలిపింది. అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి బయలుదేరతారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.