News August 15, 2024

ఆగస్టు 15: చరిత్రలో ఈ రోజు

image

1769: ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ జననం
1945: నటుడు రాళ్లపల్లి వెంకట నరసింహరావు జననం
1947: భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం
1961: సినీ నటి సుహాసిని జననం
1964: సినీ నటుడు శ్రీహరి జననం
1971: బహ్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం
1975: భారత మాజీ క్రికెటర్ విజయ్ భరద్వాజ్ జననం
2018: భారత మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్ మరణం

Similar News

News September 14, 2025

భారీ బహిరంగ సభ.. నేడు విశాఖకు జేపీ నడ్డా

image

AP: నేడు రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. విశాఖ రైల్వే మైదానంలో నిర్వహించే సారథ్య యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వెల్లడించారు. ఈనెల 17న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా విశాఖలో పర్యటిస్తారని తెలిపారు. అలాగే అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా ఖాదీ సంత నిర్వహించబోతున్నట్లు ప్రెస్‌మీట్‌లో తెలిపారు.

News September 14, 2025

OG మూవీలో నేహాశెట్టి సర్‌ప్రైజ్

image

పవన్ కళ్యాణ్ ‘OG’మూవీపై హైప్ అంతకంతకూ పెంచేస్తున్నారు. తాజాగా ఇందులో ఓ ఐటమ్ సాంగ్ ఉందని క్లారిటీ వచ్చింది. DJ టిల్లు మూవీ ఫేమ్ నేహాశెట్టి ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా వాటిని స్వయంగా హీరోయినే కన్ఫమ్ చేశారు. ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆమె ‘OG’లో సర్‌ప్రైజ్ ఉంటుందని వెల్లడించారు. కేవలం సాంగ్ మాత్రమే కాకుండా.. పవన్‌తో కీలక సన్నివేశాల్లోనూ నటించినట్లు తెలుస్తోంది.

News September 14, 2025

నేడు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం, అనుబంధంగా ద్రోణి విస్తరించిందని APSDMA తెలిపింది. దాని ప్రభావంతో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురవొచ్చని చెప్పింది. శ్రీకాకుళం, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షం, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.