News August 15, 2024

నాది రెడ్ బుక్ కాదు.. ఓపెన్ బుక్: లోకేశ్

image

AP: రెడ్ బుక్‌పై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారానికి మంత్రి నారా లోకేశ్ కౌంటరిచ్చారు. తనది రెడ్ బుక్ కాదని, ఓపెన్ బుక్ అని ట్వీట్ చేశారు. ‘ఫేకు జగన్ నీలా నాపై కేసులు లేవు. విదేశాలకు వెళ్లాలంటే నీలా కోర్టు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితోనే విదేశాలకు వెళ్లా. జనాలు కొట్టిన స్లిప్పర్ షాట్ నుంచి కోలుకోవడానికి సమయం పడుతుంది. చిల్ బ్రో’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 13, 2026

అందరికీ రైతుభరోసా.. కోడ్ ముగియగానే ఖాతాల్లోకి డబ్బులు!

image

TG: సాగు చేసే భూములకే రైతు భరోసా (ఎకరానికి రూ.6వేలు) చెల్లించాలని భావించిన ప్రభుత్వం దానిపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. శాటిలైట్ <<18752197>>సర్వేతో<<>> లింకు పెట్టకుండా ఖరీఫ్ సీజన్‌లో పొందిన రైతులందరికీ యాసంగిలోనూ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో మొత్తం 1.45 కోట్ల ఎకరాలకు నిధులు విడుదల చేయనుంది. మున్సిపల్ ఎన్నికల కోడ్ ఈ నెల 16తో ముగియనుండగా ఆ వెంటనే ఖాతాల్లో డబ్బులు జమ చేసే అవకాశం ఉంది.

News February 13, 2026

టమాటాతో చర్మానికి తాజాదనం

image

మనం కూరల్లో ఎక్కువగా వాడే టమాటాతో అనేక సౌందర్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. చర్మ సంరక్షణలో టమాటా ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.. * టమాటా గుజ్జులో కాస్త కీరా రసం కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది. * రెండు చెంచాల పెరుగులో టమాటా రసం, బాదం పేస్ట్ కలిపి ముఖానికి రాయడం వల్ల నిర్జీవంగా ఉన్న చర్మం తాజాగా మారుతుంది.

News February 13, 2026

పట్టణాల్లో ‘హ్యాపీ సండే’

image

AP: పట్టణ ప్రజల్లో ఆరోగ్యవంతమైన జీవనశైలిని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా హ్యాపీ సండే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ప్రతి నెలా 2, 4వ ఆదివారాల్లో ఉదయం రెండు గంటలపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. యోగ, ఫిట్‌నెస్ సెషన్లు, క్రీడా పోటీలు, సృజనాత్మక చర్చల అమలుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది.