News August 15, 2024
WGL: నాలాల విస్తరణ పెను సవాలే!
వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో 10 ప్రధాన నాళాలు ఉన్నాయి. ఏటా వర్షాకాలంలో పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. నగరానికి ముప్పు తప్పించేందుకు ప్రణాళిక రచించారు. వరద నీరు పారే నాళాలను విస్తరించాలని సాంకేతిక నిపుణుల కమిటీలు నివేదిక ఇచ్చాయి. విస్తరించేందుకు గ్రేటర్ వరంగల్ సిద్ధమైనా పూర్తి చేయడం యంత్రాంగానికి సవాల్‌గా మారింది. దాదాపు 70-80 శాతం పట్టా భూములే ఉన్నాయి. ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు.
Similar News
News November 27, 2024
వరంగల్ రీజియన్‌లో 170 ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు
మాజీ సైనికులను RTC డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఈ మేరకు వరంగల్ రీజియన్‌లో 170 పోస్టులు కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. అర్హులైనవారు ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26 వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.
News November 27, 2024
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: సీతక్క
రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రములో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం దేశం బాగుంటుందని, రైతులకు సన్న ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తూ రూ.500 బోనస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు.
News November 27, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..
> WGL: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో జరిమానా
> HNK: అక్రమంగా గుట్కా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
> NSPT: గంజాయి పట్టివేత
> WGL: వ్యవసాయ బావిలో పడి గొర్రెల కాపరి మృతి
> JN: గుట్కా పట్టివేత
> WGL: ఒకరిపై పీడీ యాక్ట్ నమోదు
> MHBD: రోడ్డు ప్రమాదంలో ఫోటోగ్రాఫర్ మృతి!
> HNK: పరకాల పరిధిలో పోగొట్టుకున్న ఫోన్ అందజేత