News August 15, 2024
నెల్లూరులో సీనియర్‌పై జూనియర్ల దాడి

సీనియర్ విద్యార్థిపై జూనియర్లు దాడి చేసిన ఘటన నెల్లూరులో జరిగింది. బాలాజీ నగర్ పోలీసుల వివరాల మేరకు.. ఆషరథ్ నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. అదే కాలేజీకి చెందిన జూనియర్లు కైఫ్ మన్సూర్, ముజమిల్, షాహుల్‌ను కేఫ్ వద్ద అతడు కలిశాడు. మద్యం తాగేందుకు డబ్బులు కావాలని జూనియర్లు ఆషరథ్‌ని అడిగారు. అతడు లేవని చెప్పడంతో ఇటుక రాయితో కొట్టారు.
Similar News
News January 26, 2026
నెల్లూరు: 1070 మందిలో ఫ్లోరోసిస్ ప్రభావం

వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణ నీటి పారుదల శాఖ సంయుక్తంగా చేపడుతున్న ఫ్లోరోసిస్ సర్వేలో 1070 మందిని అనుమానిత కేసులుగా గుర్తించారు. నవంబర్ నుంచి 6 నెలలపాటు జరిగే ఈ సర్వేలో 3,4,5 తరగతుల పిల్లల్లో, పంచాయతీ స్థాయిలో 20 హౌసెస్లలో చేపట్టిన సర్వేలో వారి నుంచి యూరిన్ శాంపిల్స్ పరీక్షించునున్నారు. జిల్లాలో వీకే పాడు, దుత్తలూరు, ఉదయగిరి, కొండాపురం, కలిగిరి, వింజమూరు వంటి మెట్ట ప్రాంతాల్లో ఈ సర్వే జరుగుతోంది.
News January 26, 2026
నెల్లూరు జెండా ఎగురవేసిన కలెక్టర్

నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత ఎస్పీ డాక్టర్ అజిత వెజండ్లతో కలిసి జెండా వందనం చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్, ఎస్పీ కలిసి శాంతి కపోతాలను ఎగురవేశారు. ఈ వేడుకలకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
News January 26, 2026
బస్టాండ్, రైల్వే స్టేషన్లలో తనిఖీలు

SP డా అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు రేపు జరగనున్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా బస్టాండ్, రైల్వే స్టేషన్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టౌన్ ASP దీక్ష ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగర ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ తనిఖీలను ప్రత్యేక బలగాలు, స్థానిక పోలీసు బలగాలు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ల సహకారంతో విస్తృతంగా నిర్వహించారు.


