News August 15, 2024

ఖమ్మం: ముఖ్యమంత్రికి సీపీఎం బహిరంగ లేఖ

image

ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనను సీపీఎం జిల్లా సమితి స్వాగతిస్తుందని జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కోరారు. బుధవారం బహిరంగ లేఖ విడుదల చేశారు. జిల్లా అభివృద్ధి కోసం పలు సమ స్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. సీతారామ ప్రాజెక్టును పాలేరు వరకు పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని కోరారు.

Similar News

News January 23, 2025

సత్తుపల్లిలో హెల్త్ అసిస్టెంట్ సూసైడ్

image

ఆర్థిక ఇబ్బందులు తాళలేక హెల్త్ అసిస్టెంట్ పురుగు మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడని స్థానికులు తెలిపారు. వారి వివరాలు.. సత్తుపల్లి హనుమాన్ నగర్‌కు చెందిన సత్తెనపల్లి రవికుమార్(45) లంకాసాగర్ పీహెచ్‌సీలో హెల్త్ ఆసిస్టెంట్‌గా ప‌నిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 23, 2025

గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు: ఖమ్మం కలెక్టర్

image

జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీక్ష నిర్వహించారు. వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాల జారీకి ప్రతిపాదనలను అందించాలని సూచించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.

News January 23, 2025

KMM: పోలీసుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటాం: సీపీ

image

పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన న్యూ ఇయర్ క్యాలెండర్‌ను బుధవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. పోలీసు సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని సీపీ అన్నారు. పోలీసుల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఏశోబు తదితరులు పాల్గొన్నారు.