News August 15, 2024
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నేటి వివరాలు
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 698.325 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 965 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 17, 2024
మందమర్రిలో కనిపించిన పెద్దపులి
మందమర్రిలోని శంకరపల్లి, KK 5 గని సమీపంలో శనివారం పెద్దపులి సంచారం కలకలం రేపింది. కొద్దిరోజులుగా జన్నారం, కాసిపేట, చెన్నూర్, వేమనపల్లి ప్రాంతాల్లో పులి సంచరిస్తోంది. కాగా నిన్న మహారాష్ట్ర వలస కూలీలకు శంకరపల్లి వద్ద పులి కనిపించినట్లు తెలిపారు. శంకరంపల్లి సమీపంలో గుడారాల్లో ఉంటున్న తమ వైపు పెద్ద పులి వచ్చిందన్నారు. గుడారాల్లోని వారందరూ భారీగా కేకలు వేయడంతో అది శతలాపూర్ వైపు వెళ్లినట్లు పేర్కొన్నారు.
News November 17, 2024
ఉట్నూర్: ఆవుపై దాడి చేసిన పెద్దపులి
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో పెద్దపులి కలకల రేపుతోంది. తాజాగా శనివారం సాయంత్రం ఉట్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామ పంచాయతీలోని వంక తుమ్మ గ్రామ సమీపంలో ఓ ఆవుపై దాడి చేసింది. దీంతో ఆవు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో మండలంలోని పలు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News November 16, 2024
నార్నూరు: కొడుకును కత్తితో పొడిచిన తండ్రి
కొడుకును తండ్రి కత్తితో పొడిచిన ఘటన నార్నూర్ మండలంలోని గుంజల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం గుంజాల గ్రామానికి చెందిన మేస్రం భుజంగరావు కుటుంబ తగాదాల కారణంగా తన కొడుకు బాలాజీని కత్తితో పొడిచాడు. స్థానికులు గమనించి బాలాజీని ఉట్నూర్ తరలించారు. కాగా అక్కడి వైద్యులు రిమ్స్ కు రిఫర్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.